IND vs NZ: టీమిండియాకు 10 వికెట్లు.. కివీస్‌కు 107 పరుగులు.. మధ్యలో వర్షం.. ఉత్కంఠగా మారిన బెంగళూరు టెస్ట్

IND vs NZ Bengaluru Day 5 Weather Report: వర్షంతో మొదలైన బెంగళూరు టెస్ట్ మ్యాచ్.. ఎన్నో మలుపులు తిరిగి నేడు చివరి రోజుకు చేరుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే కివీస్‌ను ఆలౌట్ చేయాల్సిందే. కివీస్ జట్టు విజయానికి 107 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో 5వ రోజు మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది. అలాగే, వర్షం కూడా పలకరించే అవకాశంతో మరింత ఉత్కంఠ నెలకొంది.

IND vs NZ: టీమిండియాకు 10 వికెట్లు.. కివీస్‌కు 107 పరుగులు.. మధ్యలో వర్షం.. ఉత్కంఠగా మారిన బెంగళూరు టెస్ట్
Ind Vs Nz 1st Test Day 5
Follow us

|

Updated on: Oct 20, 2024 | 8:10 AM

IND vs NZ Bengaluru Day 5 Weather Report: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో 4 రోజుల ఆట ముగిసింది. మ్యాచ్ చివరి రోజు న్యూజిలాండ్ జట్టు గెలవాలంటే 107 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే కివీస్ జట్టు 10 వికెట్లు తీయాలి. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఆధిపత్యం ప్రదర్శించినట్లు స్పష్టమవుతోంది. అందువల్ల ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే కివీస్ జట్టును త్వరగా ఆలౌట్ చేయాలి. లేదంటే వర్షం మ్యాచ్ జరగకుండా ఆపాల్సి ఉంటుంది. దీనికి తోడు రేపటి బెంగుళూరు వాతావరణ నివేదిక కూడా టీమ్ ఇండియాకు సహకరించేలా సూచనలు చేస్తోంది.

తొలి టెస్టుకు వర్షం అంతరాయం..

బెంగళూరు టెస్టు మ్యాచ్‌పై తొలిరోజు వర్షం ప్రభావం చూపుతోంది. అందుకే, మ్యాచ్‌లో మొదటి రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయలేదు. టాస్ కూడా జరగలేదు. కానీ రెండు, మూడో రోజు మాత్రమే ఆటంకం లేకుండా నిర్వహించారు. నాల్గవ రోజు వర్షం మళ్లీ రంగంలోకి దిగి తరచుగా మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా నాలుగో రోజు ఆటను ముందుగానే ముగించాల్సి వచ్చింది. ఇప్పుడు 5వ రోజు ఆటలో వర్షం ముప్పు ఉండడంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

5వ రోజు వాతావరణ నివేదిక..

అక్యూవెదర్ ప్రకారం, టెస్టు మ్యాచ్‌లో 5వ రోజు అయిన అక్టోబర్ 20న బెంగళూరులో వర్షం పడే అవకాశం 80% ఉంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు వర్షం పడే అవకాశం 51% ఉంది. దీని కారణంగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యం కావచ్చు. ఆ తరువాత, రోజంతా వర్షం పడే అవకాశం 45 నుంచి 50% వరకు ఉంటుంది. ఇదొక్కటే కాదు, సాయంత్రం 4 గంటల వరకు కూడా 39% వర్షం కురిసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కూడా తరచూ వర్షం కురిసి మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి.

టీమిండియాపై ఒత్తిడి..

ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. జట్టు తరపున సర్ఫరాజ్ అహ్మద్ 150 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, రిషబ్ పంత్ 99 పరుగులు చేశాడు. ఎట్టకేలకు న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 107 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగే న్యూజిలాండ్ జట్టును టీమిండియా బౌలర్లు అడ్డుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీమిండియాకు 10 వికెట్లు.. కివీస్‌కు 107 పరుగులు.. మధ్యలో వర్షం
టీమిండియాకు 10 వికెట్లు.. కివీస్‌కు 107 పరుగులు.. మధ్యలో వర్షం
సాయం కోసం ఏడారిలో హైదరాబాదీ ఎదురుచూపులు!
సాయం కోసం ఏడారిలో హైదరాబాదీ ఎదురుచూపులు!
వార్నీ.. ఇదెక్కడి చోద్యం.. టమోటాలకు పోలీస్ బందోబస్తు..! వీడియో
వార్నీ.. ఇదెక్కడి చోద్యం.. టమోటాలకు పోలీస్ బందోబస్తు..! వీడియో
దీపావళి సేల్‌లో ఊహకందని డీల్స్‌.. వీటిపై భారీ డిస్కౌంట్స్‌
దీపావళి సేల్‌లో ఊహకందని డీల్స్‌.. వీటిపై భారీ డిస్కౌంట్స్‌
స్థానిక ఎన్నికల్లో పోటీ అర్హతపై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు
స్థానిక ఎన్నికల్లో పోటీ అర్హతపై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు
ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా..? ఐటీ ఉద్యోగులను మించి
ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా..? ఐటీ ఉద్యోగులను మించి
పాకిస్తాన్‌కు ఇచ్చిపడేసిన భారత్.. ఉత్కంఠ మ్యాచ్‌లో ఘన విజయం
పాకిస్తాన్‌కు ఇచ్చిపడేసిన భారత్.. ఉత్కంఠ మ్యాచ్‌లో ఘన విజయం
ఫ్లాపుల్లో ఉన్నా తగ్గిదేలే.. వరుస సినిమాతో బిజీగా శర్వా..
ఫ్లాపుల్లో ఉన్నా తగ్గిదేలే.. వరుస సినిమాతో బిజీగా శర్వా..
మరోసారి షాకిచ్చిన బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే
మరోసారి షాకిచ్చిన బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే
అందాల బాణాలు వేస్తున్న హీరోయిన్స్.. గ్లామర్ షోపైనే అందరి ఫోకస్..
అందాల బాణాలు వేస్తున్న హీరోయిన్స్.. గ్లామర్ షోపైనే అందరి ఫోకస్..