AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: నేడు భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్.. ఉచితంగా ఎలా చూడొచ్చంటే?

IND vs BAN T20 World Cup Live Streaming: శనివారం జూన్ 1, న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో T20 ప్రపంచ కప్ 2024 వార్మప్ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ తలపడతాయి. పొట్టి ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ చాలా కీలకంగా మారింది.

IND vs BAN: నేడు భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్.. ఉచితంగా ఎలా చూడొచ్చంటే?
Ind Vs Ban Warm Up Match
Venkata Chari
|

Updated on: Jun 01, 2024 | 9:46 AM

Share

India vs Bangladesh, ICC Mens T20 World Cup 2024 Warm-up 15th Match: నేడు, శనివారం, జూన్ 1న న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో T20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024) వార్మప్ మ్యాచ్‌లో భారత్ vs బంగ్లాదేశ్ తలపడనున్నాయి. పొట్టి ప్రపంచకప్‌ సన్నాహాల్లో ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకం. మే 26న అమెరికా బయల్దేరిన టీమిండియా.. ఇప్పటికే ప్రాక్టీస్‌లో బిజీగా ఉంది. కాబట్టి లీగ్ ప్రారంభానికి ముందు టీమ్ బ్యాలెన్స్‌ను కనుగొనడానికి ఈ మ్యాచ్ భారత్‌కు ముఖ్యమైనది. మరోవైపు అమెరికాతో బంగ్లాదేశ్‌ తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. అయితే, ఈ వార్మప్ మ్యాచ్‌కు ముందు జరిగిన రెండు జట్ల టీ20 సిరీస్‌లో ఆతిథ్య అమెరికా 2-1 తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ ఘోర పరాజయం నుంచి బంగ్లాదేశ్ జట్టు కోలుకోవాలంటే టీమ్ ఇండియాపై విజయం సాధించాలని కోరుకుంటుంది.

ఇరుజట్ల రికార్డులు..

ఈ మ్యాచ్ ప్రాక్టీస్ మ్యాచ్ అయినప్పటికీ ఇటీవల ఇరు జట్ల మధ్య జరిగిన ముఖాముఖిని పరిశీలిస్తే ఇది ఉత్కంఠభరితమైన మ్యాచ్ అని భావిస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లు జరగడం గమనార్హం. అయితే, మెన్ ఇన్ బ్లూ బెంగాల్ టైగర్స్‌ పైచేయి సాధించింది. రెండు జట్ల మధ్య జరిగిన 13 మ్యాచ్‌లలో భారతదేశం 12 విజయాలు సాధించింది.

ప్రాక్టీస్ మ్యాచ్ గురించి పూర్తి సమాచారం..

భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

రేపు అంటే జూన్ 1న భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది.

భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది?

న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ జరుగుతోంది.

భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

అమెరికాలో ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతున్నందున ఇరుదేశాల మధ్య సమయం చాలా తేడా ఉంటుంది. అయితే, ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.

భారతదేశం vs బంగ్లాదేశ్ T20 ప్రపంచ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంటుంది. అలాగే, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోని వివిధ ఛానెల్‌లలో ఈ మ్యాచ్‌ను టీవీలో చూడొచ్చు.

రెండు జట్లు..

టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

రిజర్వ్‌ ప్లేయర్లు: శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), తస్కిన్ అహ్మద్, లిటెన్ దాస్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహమూద్ ఉల్లా రియాద్, జాకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, మహిదీ హసన్, రిషాద్ హుస్సేన్, రిషాద్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్.

రిజర్వ్‌ ప్లేయర్లు: అఫీఫ్ హుస్సేన్, హసన్ మహమూద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్విగ్గిలో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఇదే..!
స్విగ్గిలో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఇదే..!
నాన్వె జ్ రుచితో.. మీల్ మేకర్ గ్రేవీ! అన్నం చపాతీకి సూపర్ జోడీ
నాన్వె జ్ రుచితో.. మీల్ మేకర్ గ్రేవీ! అన్నం చపాతీకి సూపర్ జోడీ
కెప్టెన్ మార్పుతో భారత్‎లో అడుగుపెడుతున్న బ్లాక్ క్యాప్స్!
కెప్టెన్ మార్పుతో భారత్‎లో అడుగుపెడుతున్న బ్లాక్ క్యాప్స్!
నవరత్నాలు పొదిగిన చీరకు గిన్నిస్‌బుక్‌లో చోటు
నవరత్నాలు పొదిగిన చీరకు గిన్నిస్‌బుక్‌లో చోటు
సోషల్‌ మీడియా అకౌంట్లకు ఐటీ అధికారులకు యాక్సెస్‌ ఉంటుందా?
సోషల్‌ మీడియా అకౌంట్లకు ఐటీ అధికారులకు యాక్సెస్‌ ఉంటుందా?
అద్దిరిపోయే లుక్‌లో హార్ట్‌బీట్‌ నెక్లెస్‌! పార్టీలో మీరే స్పెషల్
అద్దిరిపోయే లుక్‌లో హార్ట్‌బీట్‌ నెక్లెస్‌! పార్టీలో మీరే స్పెషల్
SRHకు ఆ ప్లేయర్ బిగ్ ప్లస్ పాయింట్.. కావ్య స్కెచ్‌కు తిరుగులేదంతే
SRHకు ఆ ప్లేయర్ బిగ్ ప్లస్ పాయింట్.. కావ్య స్కెచ్‌కు తిరుగులేదంతే
ప్యారడైజ్ సినిమాను మిస్సైన స్టార్ హీరోయిన్..
ప్యారడైజ్ సినిమాను మిస్సైన స్టార్ హీరోయిన్..
ఎంత ధైర్యం రా.. ఇంట్లోనే పెట్రోల్ పంపు తెరిచాడు..!
ఎంత ధైర్యం రా.. ఇంట్లోనే పెట్రోల్ పంపు తెరిచాడు..!
కాఫీ ప్రియులకు అలర్ట్! గ్లోయింగ్ స్కిన్ కావాలా లేక ముడతలు రావాలా?
కాఫీ ప్రియులకు అలర్ట్! గ్లోయింగ్ స్కిన్ కావాలా లేక ముడతలు రావాలా?