IND vs WI: టీ20 సిరీస్ నుంచి గిల్ ఔట్.. సీఎస్‌కే స్టార్ ఓపెనర్‌కు లక్కీ ఛాన్స్?

Indian vs West Indies T20I: వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ఐల సిరీస్ ఆడనుంది. టీ20 సిరీస్‌లో శుభ్‌మన్ గిల్‌కు బదులుగా రుతురాజ్ గైక్వాడ్‌ను జట్టులోకి తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి.

IND vs WI: టీ20 సిరీస్ నుంచి గిల్ ఔట్.. సీఎస్‌కే స్టార్ ఓపెనర్‌కు లక్కీ ఛాన్స్?
Shubman Gill Gt Vs Mi
Follow us
Venkata Chari

|

Updated on: Jun 23, 2023 | 6:15 AM

Indian vs West Indies T20I: భారత జట్టు వచ్చే నెల (జులై) వెస్టిండీస్‌లో పర్యటించనుంది. అక్కడ భారత జట్టు టెస్ట్, వన్డే, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనుంది. ఈ టూర్‌కు ముందు భారత టెస్టు, టీ20 టీమ్‌లో చాలా పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయని టాక్ నడుస్తోంది. టెస్టుతో పాటు టీ20 సిరీస్‌లోనూ యువ ఆటగాళ్లను చేర్చుకోవడంపై చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే టీ20ఐ సిరీస్‌లో కీలక మార్పు రావొచ్చని తెలుస్తోంది. వాస్తవానికి, టీ20 జట్టులో శుభ్‌మన్ గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం ఇవ్వవచ్చని సమాచారం.

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటివరకు భారత్ తరపున 9 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 135 పరుగులు చేశాడు. గైక్వాడ్ అత్యధిక స్కోరు 57 పరుగులు. ఐపీఎల్ 2023లో గైక్వాడ్ చెన్నై తరపున ఆడుతున్నప్పుడు అద్భుత ప్రదర్శన చేశాడు.

గైక్వాడ్ 16 మ్యాచ్‌లలో 15 ఇన్నింగ్స్‌లలో 42.14 సగటు, 147.50 స్ట్రైక్ రేట్‌తో 590 పరుగులు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టులో మరో అవకాశం ఇవ్వవచ్చని తెలుస్తోంది. గైక్వాడ్ దాదాపు ఏడాది క్రితం జూన్ 26, 2022న ఐర్లాండ్‌తో తన చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.

ఇవి కూడా చదవండి

శుభమాన్ గిల్ ఎందుకు ఔట్ కావచ్చు?

మీడియా కథనాల ప్రకారం, వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్ నుంచి శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తుంది. దీని కారణంగా రుతురాజ్ గైక్వాడ్‌కు మరోసారి భారత టీ20 జట్టులోకి అవకాశం లభించవచ్చు. అయితే ఇప్పటివరకు ఆడిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో గైక్వాడ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

జులై 12 నుంచి వెస్టిండీస్ టూర్ ప్రారంభం..

భారత వెస్టిండీస్ పర్యటన బుధవారం, జులై 12, డొమినికాలో జరిగే టెస్ట్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఈ టూర్‌లో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత జులై 27, గురువారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అదే సమయంలో, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆగస్టు 3, గురువారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో చివరి మ్యాచ్ ఆగస్టు 13, శనివారం జరుగుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..