IND vs SA: యువ భారత్‌ చేతిలో సఫారీలు చిత్తు.. రాజ్‌కోట్‌లో టీమిండియా ఏకపక్ష విజయానికి కారణాలివే..

IND Vs SA 4th T20: దక్షిణఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసింది టీమిండియా. సిరీస్‌ చేజారకూడదంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో యువ భారత్‌ జూలు విదిల్చింది. రాజ్‌కోట్‌ వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో సఫారీలను..

IND vs SA: యువ భారత్‌ చేతిలో సఫారీలు చిత్తు.. రాజ్‌కోట్‌లో టీమిండియా ఏకపక్ష విజయానికి కారణాలివే..
Ind Vs Sa
Follow us
Basha Shek

|

Updated on: Jun 18, 2022 | 8:38 AM

IND Vs SA 4th T20: దక్షిణఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసింది టీమిండియా. సిరీస్‌ చేజారకూడదంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో యువ భారత్‌ జూలు విదిల్చింది. రాజ్‌కోట్‌ వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో సఫారీలను ఏకంగా 82 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. టీమిండియా నయా ఫినిషర్‌ దినేశ్‌ కార్తీక్‌ (27 బంతుల్లో 55; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో మొదటి అర్ధసెంచరీ సాధించాడు. అతనికి తోడు హార్దిక్‌ పాండ్యా (31 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆ తర్వాత టార్గెట్‌ ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆది నుంచే తడబడింది. టీమిండియా బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. అవేశ్‌ ఖాన్‌ (4/18), యుజువేంద్ర చాహల్‌ (21/2), హర్షల్‌ పటేల్‌ (3/1) ధాటికి కేవలం 16. ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.   కాగా సిరీస్‌లోని చివరి, నిర్ణయాత్మకమైన ఐదో టీ20 మ్యాచ్‌ రేపు బెంగళూరులో జరుగుతుంది.

తడబడినా.. నిలబడ్డారు.. కాగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగని భారత్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. గత మ్యాచ్‌లో అర్ధసెంచరీతో రాణించిన రుతురాజ్‌ గైక్వాడ్‌ త్వరగానే ఔటయ్యాడు. శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, కెప్టెన్‌ పంత్‌ కూడా త్వరత్వరగానే పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో 81 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. అయితే వైస్‌ కెప్టెన్‌ పాండ్యాకు దినేశ్ కార్తీక్‌ జత కలవడంతో టీమిండియా కోలుకుంది. వీరు కేవలం33 బంతుల్లో 65 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు. పాండ్యా ఔటైనా డీకే తన జోరు కొనసాగించాడు. ఫోర్లు, సిక్స్‌లతో సఫారీ బౌలర్లను ఉతికారేశాడు. ఇక బౌలర్ల కూడా సమష్ఠిగా రాణించారు. ముఖ్యంగా గత మూడు మ్యాచ్‌ల్లోనూ పెద్దగా ఆకట్టుకోని అవేశ్‌ ఖాన్‌ దక్షిణాఫ్రికాను బాగా దెబ్బ తీశాడు. అతనితో పాటు యుజువేంద్ర చాహల్, హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది సౌతాఫ్రికా. దీంతో టీమిండియాకు వరుసగా రెండో విజయం ఖరారైంది..

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..