Dinesh Karthik: అవార్డ్‌ అందుకునేందుకు స్టేజ్‌పైకి వచ్చిన దినేశ్ కార్తిక్‌.. ఒక్కసారిగా భయపడిపోయాడు

Dinesh Karthik: సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌ మెరుపులతో దినేశ్‌ కార్తిక్‌ మరోసారి హీరో అయ్యాడు. బౌలింగ్‌లో ఆవేశ్‌ ఖాన్‌ నిప్పులు చెరిగినప్పటికి....

Dinesh Karthik: అవార్డ్‌ అందుకునేందుకు స్టేజ్‌పైకి వచ్చిన దినేశ్ కార్తిక్‌.. ఒక్కసారిగా భయపడిపోయాడు
Dinesh Karthik
Follow us
Subhash Goud

|

Updated on: Jun 18, 2022 | 6:14 PM

Dinesh Karthik: సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌ మెరుపులతో దినేశ్‌ కార్తిక్‌ మరోసారి హీరో అయ్యాడు. బౌలింగ్‌లో ఆవేశ్‌ ఖాన్‌ నిప్పులు చెరిగినప్పటికి.. అంతకముందు బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాను నిలబెట్టిన కార్తిక్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఇదిలా ఉండగా మ్యాచ్‌ అనంతరం అవార్డ్‌ అందుకునేందుకు స్టేజ్‌పైకి వచ్చిన కార్తిక్‌, ఆకాశం వైపు చూస్తూ ఒక్కసారిగా భయపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

ఇవి కూడా చదవండి

కార్తిక్‌ ఇంటర్య్వూ సమయంలో దేనినో చూసి బయపడినట్లు కనిపించింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో తన ప్రదర్శనపై అడిగిన ప్రశ్నకు కార్తిక్‌ సమాధానం ఇచ్చే పనిలో ఉన్నాడు. ఈ సమయంలో ఒక్కసారిగా పైకి చూసిన కార్తిక్‌ ఏదో తన వైపుకు దూసుకొస్తున్నట్లు, వామ్మో అంటూ దాని నుంచి తప్పించుకుంటున్నట్లు రియాక్షన్‌ ఇచ్చాడు. కాసేపటికే తేరుకొని.. సారీ అక్కడి నుంచి వచ్చిన బంతి నావైపు దూసుకొచ్చినట్లుగా అనిపించిందంటూ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి