AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: న్యూజిలాండ్‌లో రోహిత్‌కు బాగా కలిసొచ్చిన మైదానం..రేపు రికార్డులు బద్దలే

IND vs NZ: న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేకు ముందు రోహిత్ శర్మ బే ఓవల్ రికార్డు ఆసక్తి రేపుతోంది. ఈ మైదానంలో రెండు మ్యాచ్‌లు ఆడి 149 పరుగులు చేశాడు. 74.50 సగటుతో పాటు రెండు అర్ధసెంచరీలు సాధించాడు. 2019లో ఇదే గ్రౌండ్‌లో 87 పరుగులతో అదరగొట్టాడు.

IND vs NZ: న్యూజిలాండ్‌లో రోహిత్‌కు బాగా కలిసొచ్చిన మైదానం..రేపు రికార్డులు బద్దలే
Rohit Sharma (3)
Rakesh
|

Updated on: Nov 12, 2026 | 7:52 PM

Share

IND vs NZ: న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. భారత్, న్యూజిలాండ్ మధ్య నాలుగో వన్డే నవంబర్ 13న అంటే రేపు మౌంట్ మాంగనూయిలోని బే ఓవల్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మపైనే ఉండనుంది. తొలి రెండు వన్డేల్లో ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయిన హిట్‌మ్యాన్.. తనకు బాగా కలిసొచ్చిన మైదానంలో తిరిగి ఫామ్ అందుకుంటాడా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

బే ఓవల్‌లో రోహిత్ రికార్డు అదుర్స్

బే ఓవల్ మైదానంలో రోహిత్ శర్మ ఇప్పటివరకు రెండు వన్డేలు ఆడాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో కలిపి 149 పరుగులు సాధించాడు. 74.50 సగటుతో పరుగులు చేసిన రోహిత్.. వరుస ఇన్నింగ్స్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ మైదానంలో అతడి అత్యధిక స్కోరు 87 పరుగులు. అంటే ఈ గ్రౌండ్‌లో రోహిత్‌కు మంచి రికార్డే ఉంది. నాలుగో వన్డేలోనూ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే భారత జట్టుకు మంచి ఆరంభం లభించే అవకాశం ఉంది.

న్యూజిలాండ్ గడ్డపై హిట్‌మ్యాన్ గణాంకాలు

న్యూజిలాండ్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 17 వన్డేలు ఆడి 460 పరుగులు చేశాడు. ఈ దేశంలో అతడి బ్యాటింగ్ సగటు 32.85గా ఉంది. ఇందులో దాదాపు మూడో వంతు పరుగులు బే ఓవల్ మైదానంలోనే సాధించడం విశేషం. అయితే ప్రస్తుత సిరీస్‌లో మాత్రం రోహిత్ ఇంకా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. తొలి రెండు వన్డేల్లో ఒకసారి డకౌట్ కాగా, మరో మ్యాచ్‌లో 23 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో నాలుగో వన్డేలో భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Ishan Kishan: ఫుట్‌బాల్ మైదానంలో టీమిండియా క్రికెటర్ల సందడి.. సిరాజ్‌పై ఇషాన్ కిషన్ విజయం

2019లో 87 పరుగులతో అదరగొట్టిన రోహిత్

బే ఓవల్‌లో రోహిత్ శర్మ అత్యుత్తమ ప్రదర్శన 2019 జనవరి 26న వచ్చింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో అతడు 96 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా 67 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభం అందించాడు. వీరిద్దరి బ్యాటింగ్‌తో భారత్ భారీ స్కోరుకు పునాది పడింది.

మళ్లీ అదే జోరు చూపిస్తాడా?

ఆ మ్యాచ్‌లో భారత జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి అదే మైదానంలో భారత్ బరిలోకి దిగుతోంది. శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేని పరిస్థితుల్లో రోహిత్‌పై మరింత బాధ్యత ఉండనుంది. రుతురాజ్ గైక్వాడ్ అతడితో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని సమాచారం. మరి తనకు బాగా కలిసొచ్చిన బే ఓవల్‌లో రోహిత్ మళ్లీ భారీ స్కోరు సాధిస్తాడా? అన్నది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రోహిత్‌కు బాగా కలిసొచ్చిన మైదానం..రేపు రికార్డులు బద్దలే
రోహిత్‌కు బాగా కలిసొచ్చిన మైదానం..రేపు రికార్డులు బద్దలే
ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'కల్ట్'! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'కల్ట్'! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
మందుబాబులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై చుక్కేసి చిక్కితే జైలుకే!
మందుబాబులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై చుక్కేసి చిక్కితే జైలుకే!
ముచ్చింతల్‌లో ముగిసిన యతీంద్ర సప్తతి వేడుకలు.. 1,001 కలశాలతో..
ముచ్చింతల్‌లో ముగిసిన యతీంద్ర సప్తతి వేడుకలు.. 1,001 కలశాలతో..
ఇవి చెక్‌ చేయకుండా హెల్మెంట్ కొంటే.. మీ డబ్బులు వేస్ట్‌
ఇవి చెక్‌ చేయకుండా హెల్మెంట్ కొంటే.. మీ డబ్బులు వేస్ట్‌
పెద్ద స్కెచే.. ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్తనంటూ బిల్డప్..
పెద్ద స్కెచే.. ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్తనంటూ బిల్డప్..
తండ్రి గురించి తరుణ్ భాస్కర్ చెప్పిన ఈ మాటలు వింటే కన్నీళ్లాగవు
తండ్రి గురించి తరుణ్ భాస్కర్ చెప్పిన ఈ మాటలు వింటే కన్నీళ్లాగవు
టీమిండియాకు గుడ్‌న్యూస్
టీమిండియాకు గుడ్‌న్యూస్
గ్యాస్ స్టవ్ నాబ్స్‌పై జిడ్డు, మురికి పట్టిపోయాయా? ఈ సులభమైన పద్ధ
గ్యాస్ స్టవ్ నాబ్స్‌పై జిడ్డు, మురికి పట్టిపోయాయా? ఈ సులభమైన పద్ధ
బాలల దినోత్సవం సందర్భంగా 61.84 లక్షల మంది విద్యార్థులకు కేకులు..
బాలల దినోత్సవం సందర్భంగా 61.84 లక్షల మంది విద్యార్థులకు కేకులు..