Hyderabad: మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఇకపై చుక్కేసి చిక్కితే జైలుకే!
ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసి వాహనదారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ముఖ్యంగా డ్రంక్ డ్రైవ్ చేసే వారికి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. దొరుకుతే ఫైనే కదా కట్టేసి వెళ్దాం లేని మందేసి బండెక్కుతున్నారు. కానీ ఇకపై అలా కుదరదు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికే డైరెక్ట్‌గా జైలుకే వెళ్లాల్సి ఉంటుంది. తాజాగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఐదుగురికి జైలు శిక్ష విధించింది కోర్టు.

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ ,డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి నమోదు చేసిన మొత్తం 08 కేసుల్లో పట్టుబడిన వారిని మేడ్చల్‌లోని జూనియర్ సివిల్ జడ్జి-కమ్-VII అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరు పరచగా వాటిపై విచారణ జరిపిన న్యాయ స్థానం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఐదుగురికి జైలు శిక్ష విధుస్తూ తీర్పు వెలువరించింది. మరికొందరికి ఫైన్ వేసింది.
అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు మొత్తం రూ.2,000/- జరిమానా విధించిగా.. డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడిన ఆరుగురికి రూ. 4,500 జరిమానా విధించడంతో పాటు, ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ ఐదుగురిలో ఒకరికి 10 రోజుల జైలు శిక్ష, నలుగురికి 04 రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్టు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
