AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cult OTT: ఓటీటీలోకి విశ్వక్ సేన్ ‘కల్ట్’! ఫస్ట్ ఇండియన్ స్లాషర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ క్రైమ్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ కల్ట్. అక్టోబర్ 30న రిలీజైన ఈ సినిమా బాగానే ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పటికీ చాల చోట్ల థియేటర్లలో ఆడుతోన్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది.

Cult OTT: ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'కల్ట్'! ఫస్ట్ ఇండియన్ స్లాషర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Vishwak Sen's Cult Movie
Basha Shek
|

Updated on: Nov 12, 2026 | 7:48 PM

Share

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ సినిమా #కల్ట్. ఫస్ట్ ఇండియన్ స్లాషర్ థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కిన ఈ మూవీలో విశ్వక్ తో పాటు గాయత్రి భరద్వాజ్, తారక్‌ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, విశాఖ్ నాయర్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. టీజర్స్ , గ్లింప్స్, ట్రైలర్ తో రిలీజ్ కు ముందే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న కల్ట్ మూవీ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ ఓ వర్గం వారికి మాత్రమే నచ్చింది. ఇందులో యాక్షన్ సీన్స్ మరీ ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను చూడలేకపోయారు. దీంతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్ట్ మూవీ జస్ట్ యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. కాగా ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో రన్ అవతోన్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. స్క్విడ్ గేమ్ తరహాలో వయలెంట్‌గా సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ త్వరలోనే ఓటీటీలోకి రానుందని సమాచారం. కల్ట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో థియేటర్లలో రిలీజైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి తీసుకురావాలని డీల్ జరిగిందని సమాచారం. ఈ లెక్కన నవంబర్ లాస్ట్ వీక్ లో విశ్వక్ సేన్ సినిమా ఓటీటీలోకి రావొచ్చని టాక్.

కల్ట్ సినిమా విషయానికి వస్తే.. తారక్ సినిమా బ్యానర్‌పై సందీప్ కాకరాల ఈ సినిమాను నిర్మించారు. కేజీఎఫ్, సలార్ సినిమాల ఫేమ్ రవిబ్రసూర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కల్ట్ సినిమా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకోవడానికి రవి బ్రసూర్ అందించిన బీజీఎమ్ ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గోవాకు సరదాగా గడపడానికి వెళ్లిన కొంతమంది యువకులు ఓ రహస్యమైన పార్టీ కోసం దీవిలోకి వెళతారు. అయితే అక్కడ కొందరు దండగులు గేమ్ ఆడాలంటూ పార్టీలో ఉన్న కొందరిని దారుణంగా చంపేస్తుంటారు. అయితే పబ్‌లో ఉన్న వారిలో డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) కూడా ఉంటారు. మరి పార్టీలో ఉన్న 300 మందిని డీఎస్పీ సంకల్ప్ ఎలా కాపాడారు? 300 మంది తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలా రక్తపాతంతో కూడిన భయానక ఆట ఆడారు? అనేది తెలియాలంటే కల్ట్ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

కల్ట్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'కల్ట్'! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'కల్ట్'! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
మందుబాబులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై చుక్కేసి చిక్కితే జైలుకే!
మందుబాబులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై చుక్కేసి చిక్కితే జైలుకే!
ముచ్చింతల్‌లో ముగిసిన యతీంద్ర సప్తతి వేడుకలు.. 1,001 కలశాలతో..
ముచ్చింతల్‌లో ముగిసిన యతీంద్ర సప్తతి వేడుకలు.. 1,001 కలశాలతో..
ఇవి చెక్‌ చేయకుండా హెల్మెంట్ కొంటే.. మీ డబ్బులు వేస్ట్‌
ఇవి చెక్‌ చేయకుండా హెల్మెంట్ కొంటే.. మీ డబ్బులు వేస్ట్‌
పెద్ద స్కెచే.. ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్తనంటూ బిల్డప్..
పెద్ద స్కెచే.. ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్తనంటూ బిల్డప్..
తండ్రి గురించి తరుణ్ భాస్కర్ చెప్పిన ఈ మాటలు వింటే కన్నీళ్లాగవు
తండ్రి గురించి తరుణ్ భాస్కర్ చెప్పిన ఈ మాటలు వింటే కన్నీళ్లాగవు
టీమిండియాకు గుడ్‌న్యూస్
టీమిండియాకు గుడ్‌న్యూస్
గ్యాస్ స్టవ్ నాబ్స్‌పై జిడ్డు, మురికి పట్టిపోయాయా? ఈ సులభమైన పద్ధ
గ్యాస్ స్టవ్ నాబ్స్‌పై జిడ్డు, మురికి పట్టిపోయాయా? ఈ సులభమైన పద్ధ
బాలల దినోత్సవం సందర్భంగా 61.84 లక్షల మంది విద్యార్థులకు కేకులు..
బాలల దినోత్సవం సందర్భంగా 61.84 లక్షల మంది విద్యార్థులకు కేకులు..
మీ టూత్‌బ్రశ్‌ను ఎప్పుడు మార్చాలి? దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే
మీ టూత్‌బ్రశ్‌ను ఎప్పుడు మార్చాలి? దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే