Tharun Bhascker : ‘మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నాన్న దూరమైతే’.. తరుణ్ భాస్కర్ చెప్పిన ఈ మాటలు వింటే కన్నీళ్లాగవు
ఓ వైపు హీరోగా, సహాయక నటుడిగా చేస్తూనే దర్శకుడిగా కూడా ఆకట్టుకుంటున్నారు తరుణ్ భాస్కర్. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది 2 ('ఈఎన్ఈ రిపీట్') సీక్వెల్ తో మరోసారి డైరెక్టర్ గా అదృష్టం పరీక్షించుకోనున్నారాయన. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరుణ్ భాస్కర్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో ఇతను కూడా ఒకరు. డైరెక్టర్ గా, నిర్మాతగా, హీరోగా, సహాయక నటుడిగా, విలన్ గా.. ఇలా విభిన్నమైన రంగాల్లో సత్తా చాటుతున్నారు తరుణ్ భాస్కర్. ముఖ్యంగా ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలతో టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడీ తెలంగాణ కుర్రాడు. ఆ తర్వాత నటుడిగానూ మెప్పించాడు. అయితే 2023లో కీడాకోలా తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు తరుణ్ భాస్కర్. చాలా గ్యాప్ తర్వాత డైరెక్టర్ గా ‘ఈ నగరానికి ఏమైంది 2’తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యారు. ‘ఈఎన్ఈ రిపీట్’ పేరుతో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సీక్వెల్.. నవంబర్ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది చిత్ర బృందం. వరుసగా ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్నాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తండ్రి గురించి చాలా గొప్పగా వర్ణించారు తరుణ్ భాస్కర్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
‘మిడిల్ క్లాస్ ఇళ్లల్లో నాన్న చనిపోతే కుమారుడు ఒక్క రోజులోనే అడల్ట్ అయిపోతాడు. కాలేజీ నుంచి బయటుకు వచ్చిన నాన్న చనిపోయిన భారం నా మీద పడింది. ఓ రెంట్ కట్టాలినా? వాటర్ బిల్ ఉందా? న్యూస్ పేపర్ కు కూడా బిల్లు ఉంటుందా? వాడి దగ్గర ఖాతా ఉందా? వీడి దగ్గర ఖాతా ఉందా? ఈ లెక్కలన్నీ సడెన్ గా బయటకు వచ్చాడు. సడెన్ గా ఒక్కరోజులోనే పెద్ద మనిషి అయిపోతాడు. వాడు ఆడతూ పాడుతూ ఉంటాడు. సడెన్ గా ఏదో అవుతాది. సడెన్ గా అడల్ట్ అయిపోయే పరిస్థితి వస్తుంది. అది చెప్పి రాదు. అక్కడి నుంచి ఇంకా ఫ్రెండ్ షిప్స్ కట్ అయిపోతాయ్. ఎవరితోనూ బాధలు చెప్పుకోలేం. బయట మాట్లాడలేం. ఫ్రెండ్స్ తో కలుస్తాం. సరదాగా గడుపుదామని, నవ్వుకుందామని కలుస్తాం. కానీ ఆ నవ్వు వెనకాల ఓ బాధ ఉంటుంది. ఎవడు అడిగినా కానీ దాన్ని పక్కకు తోసేస్తూ ఉంటాం. ఇదే అడల్ట్ హుడ్ అనుకుంటా. ఎందుకంటే.. నాన్న అట్లా ఉన్నాడు. నాన్న మనకు ఏ రోజూ బాధలు చెప్పలేదు. నాన్న ఓజోన్ పొరలాగా ఉండేవాడు. అమ్మ అయితే రోజూ వంటింట్లో ఏడుస్తూ కనిపిస్తుంటుంది. కానీ నాన్నా ఏరోజూ బాధలు చెప్పడు’ అంటూ తండ్రి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడీ ట్యాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




