AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GOAT Movie Review: గోట్ సినిమా రివ్యూ.. సుడిగాలి సుధీర్ కమర్షియల్ హీరోగా నిలబడ్డారా..?

‘గాలోడు’ కమర్షియల్ సక్సెస్ తర్వాత బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ నటించిన తాజా చిత్రం గోట్. అనేక వాయిదాలు, అడ్డంకులు దాటుకుని నవంబర్ 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందో పూర్తి రివ్యూలో చూద్దాం ..

GOAT Movie Review: గోట్ సినిమా రివ్యూ.. సుడిగాలి సుధీర్ కమర్షియల్ హీరోగా నిలబడ్డారా..?
Goat
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Nov 12, 2026 | 4:33 PM

Share

మూవీ రివ్యూ: గోట్

నటీనటులు: సుధీర్ ఆనంద్, దివ్యభారతి, సర్వదమన్ బెనర్జీ, బ్రహ్మాజీ, మొట్టా రాజేంద్రన్, నితిన్ ప్రసన్న, ఆనంద్ రామరాజు తదితరులు

సంగీతం: మణిశర్మ, లియోన్ జేమ్స్

సినిమాటోగ్రఫర్: రసూల్ ఎల్లోర్, సన్నీ కురపాటి

ఎడిటింగ్: విజయ ముక్తవరపు

దర్శకత్వం: వేదవ్యాస్ ఆకుల

నిర్మాతలు: మొగుల్లా చంద్రశేఖర్

కథ:

చిన్న చిన్న గొడవలు సెటిల్ చేయడం, బెట్టింగ్లు వేయడం.. ఇదే రౌడీ సార్ (సుడిగాలి సుధీర్) దినచర్య. ఇలా సాగిపోతున్న సార్ జీవితంలోకి ఒక కిడ్నాప్ ఆఫర్ వస్తుంది. ఆనందపురంలో పెళ్లి జరుగుతుండగా మండపం నుంచి సుభాషిణి (దివ్య భారతి)ని ఎత్తుకురావడమే ఆ డీల్. ఆ బాధ్యత తీసుకున్న సార్, తన స్నేహితులతో కలిసి ఆమెను తీసుకొస్తాడు. అసలు ప్రతిసారీ ప్రాణాలు తీసుకోవాలి అనుకునే సుభాషిణి నేపథ్యం ఏంటి..? రుద్రవరం అనే గ్రామానికి ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి..? గోదావరి అవుట్ డోర్ యాక్టివిటీ ట్రస్ట్ (గోట్) పగ్గాలు ఎవరికి దక్కాయి..? బెట్టింగ్ లతో జనాలను ఇబ్బంది పెట్టే మొద్దు బాబ్జీ (నితిన్ ప్రసన్న)కి, సార్‌కి మధ్య ఉన్న వైరం ఏంటి..? ఇందులో కృష్ణంరాజు (సర్వదామన్ బెనర్జీ) పాత్ర ఎంతవరకు ముడిపడి ఉందనే విషయాలు తెరపైనే చూడాలి.

కథనం:

ఒక ఊరు, ఆ ఊరి బాగు కోసం తపించే ఒక మంచి నాయకుడు, దాన్ని నాశనం చేయాలి అనుకునే క్రూరమైన విలన్.. మధ్యలో ఆ ఊరికి దూరంగా పెరిగిన హీరో.. ఒక బలమైన ఫ్లాష్ బ్యాక్.. చివరగా హీరో వచ్చి దుర్మార్గుడిని అంతం చేసి ప్రజలను కాపాడటం. ఇలాంటి ఫార్ములా సినిమాలు తెలుగులో చాలానే వచ్చాయి. దర్శకుడు సరిగ్గా కథను తీసుకున్నాడు దర్శకుడు వేదవ్యాస్. ఆ పాత పాయింట్‌నే వీలైనంత వరకు కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేసాడు.. సుడిగాలి సుధీర్ ఉండటంతో కాస్త కొత్తగా అనిపిస్తుంది.. ఈ రొటీన్ వ్యవహారంలో కాస్త ఊరటనిచ్చే అంశం కామెడీ.. స్టార్టింగ్‌లో వచ్చే సీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చూపించడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. రుద్రవరం ఊరిలో బెట్టింగ్ పరిస్థితులు, వాటిని ఆపేందుకు తీసుకున్న నిర్ణయాలు, ఆ తర్వాత విలన్ ఎంట్రీతో కథ కాస్త వేగం పుంజుకుంటుంది. హీరోయిన్ ప్రవేశం, హీరో, అతని స్నేహితుల అల్లరితో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది. హీరోయిన్‌కు హీరో అసలు స్వరూపం తెలిసే సమయంలో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది.

ఇక సెకండాఫ్ పూర్తిగా సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. హీరోయిన్ కష్టాలు, హీరో కోసం విలన్ ముఠా వెతకడం, అన్యాయాన్ని ఎదిరించేందుకు హీరో మళ్లీ బరిలోకి దిగడం.. ఇలా అంతా ఊహకు తగ్గట్టే సాగుతుంది. హీరో గతానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ పర్లేదు. క్లైమాక్స్‌లో సుధీర్ ఫ్రెండ్స్ గ్యాంగ్ పండించిన నవ్వులు బాగున్నాయి. అయితే చివర్లో హీరోకు బదులుగా డూప్‌తో యాక్షన్ సీన్స్ తీసినట్లు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఏ దశలోనూ లాజిక్స్ అనేవి వెతకకూడదు. కమర్షియల్ హంగుల కోసం ఒక పాట, ఆ వెంటనే ఒక ఫైట్, మధ్యలో కామెడీ.. ఇలా మూస పద్ధతిలోనే సినిమాను నడిపించారు. కాకపోతే బెట్టింగ్ వ్యసనం, దానివల్ల జరిగే అనర్థాల గురించి ఇచ్చిన సందేశం బాగుంది. సినిమా కూడా ఓవరాల్‌గా చూస్తే మంచి కమర్షియల్ బొమ్మ చూసిన ఫీలింగ్ వస్తుంది.

నటీనటులు:

సినిమా మొత్తాన్ని సుడిగాలి సుధీర్ తన భుజాలపై వేసుకుని నడిపించాడు. యాక్షన్, కామెడీ, డ్యాన్సులు.. ఇలా అన్నింట్లోనూ తన మార్క్ చూపించి ఆడియన్స్‌ను అలరించాడు. దివ్య భారతికి నటనకు ఆస్కారం ఉన్న మంచి క్యారెక్టర్ దక్కింది. సర్వదామన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న తమ పాత్రల పరిధి మేర నటించారు.. బ్రహ్మాజీ తనదైన శైలిలో నవ్వించాడు. సుధీర్‌తో పాటు ఉండే స్నేహితుల గ్యాంగ్ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ మురారి ఉన్న సీన్స్ ఆకట్టుకుంటాయి. మిగతా వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

మణిశర్మ, లియోన్ జేమ్స్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా సాగింది. కెమెరా పనితనం పర్వాలేదు అనిపిస్తుంది. కథ 2010 నేపథ్యంలో సాగుతున్నట్లు చెప్పారు.. విజువల్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్స్, ఎడిటింగ్, నిర్మాణ విలువలు కథకు తగినట్లుగానే ఉన్నాయి. రచయిత రాసిన కొన్ని పంచ్ డైలాగులు థియేటర్లలో పేలాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా గోట్.. నో లాజిక్స్.. పక్కా కమర్షియల్..!

Follow Us