AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Sneha Reddy: అల్లు స్నేహారెడ్డికి అరుదైన గౌరవం.. బావోలి ఆర్ట్ సంగంలో కీలక బాధ్యతలు!

పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ సతీమణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన ఫోటోషూట్లతోపాటు పిల్లలకు సంబంధించిన ఫోటోస్, ఫ్యామిలీ ఈవెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటారు.

Allu Sneha Reddy: అల్లు స్నేహారెడ్డికి అరుదైన గౌరవం.. బావోలి ఆర్ట్ సంగంలో కీలక బాధ్యతలు!
Sneha Reddy
Rajeev Rayala
|

Updated on: Nov 12, 2026 | 5:02 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఫ్యాషన్, కళలు, సంస్కృతిపై ప్రత్యేక ఆసక్తి కనబరిచే ఆమెకు తాజాగా ఓ అరుదైన అవకాశం దక్కింది. భారతదేశంలో తొలిసారిగా నిర్వహించనున్న స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే ‘బావోలి ఆర్ట్ సంగం’లో  ఆమె కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగం చైర్‌పర్సన్‌గా అల్లు స్నేహారెడ్డి నియమితులయ్యారు. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయ వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా బావోలి ఆర్ట్ సంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలోని చారిత్రక మెట్ల బావుల (స్టెప్‌వెల్స్) విశిష్టతను ఈ వేదిక ద్వారా ప్రపంచానికి చాటిచెప్పనున్నారు. పూర్వకాలంలో నిర్మించిన మెట్ల బావులు కేవలం నీటి వనరులే కాకుండా అద్భుతమైన నిర్మాణ కళకు ప్రతీకలుగా నిలిచాయి. వాటి వెనుక ఉన్న చరిత్ర, శిల్పకళా నైపుణ్యం, నిర్మాణ శైలి, నీటికి మరియు నాగరికతకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

ఈ కార్యక్రమంలో కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగానికి చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్న అల్లు స్నేహారెడ్డి భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భారతీయ కళా సంపద, సంస్కృతి, వారసత్వంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ఆమె తనవంతు పాత్ర పోషించనున్నారు. ఫ్యాషన్‌తో పాటు కళలు, సంప్రదాయాలపై ఆమెకున్న ఆసక్తి ఈ బాధ్యతలకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. బావోలి ఆర్ట్ సంగం 2026 డిసెంబర్ 1 నుంచి 2027 జనవరి 10 వరకు నిర్వహించనున్నారు.

ఈ వేడుకలో భారతీయ కళలు, సంస్కృతి, చారిత్రక వారసత్వ సంపదను వివిధ రూపాల్లో ప్రదర్శించనున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ సతీమణిగా మాత్రమే కాకుండా కళలు, సంస్కృతి రంగాల్లోనూ తనదైన గుర్తింపు తెచ్చుకునే దిశగా అల్లు స్నేహారెడ్డి అడుగులు వేస్తున్నారు. బావోలి ఆర్ట్ సంగంలో ఆమెకు దక్కిన ఈ కీలక బాధ్యత ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us