IND vs NED Playing 11: టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..
NED vs IND, WC 2023: టాస్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. 'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. దీని వెనుక ఎటువంటి కారణం లేదు. ముందుగా బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా చాలా బాగా ఆడుతున్నాం. ఈరోజు మరోసారి మంచి ఆటను ప్రదర్శించే అవకాశం ఉంది. మా జట్టులో ఎలాంటి మార్పు లేదు' అంటూ చెప్పుకొచ్చాడు.

IND vs NED Playing 11: భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ ప్రారంభమైంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు ముఖాముఖిగా తలపడుతున్నాయి. ఇక్కడ టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమ్ ఇండియా ప్లేయింగ్-11లో ఎలాంటి మార్పు లేదు. నెదర్లాండ్స్ జట్టు కూడా ఎలాంటి మార్పులు లేకుండానే రంగంలోకి దిగింది.
టాస్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. దీని వెనుక ఎటువంటి కారణం లేదు. ముందుగా బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా చాలా బాగా ఆడుతున్నాం. ఈరోజు మరోసారి మంచి ఆటను ప్రదర్శించే అవకాశం ఉంది. మా జట్టులో ఎలాంటి మార్పు లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ, ‘మేం కూడా ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసి ఉండేవాళ్లం. ఇది మంచి వికెట్‌గా కనిపిస్తోంది. లక్ష్యాలను ఛేజింగ్ చేయడానికి ఇది మంచి మైదానం కూడా. ఈరోజు మనం మొత్తం ప్రపంచకప్‌లో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకుల ముందు ఆడతాం. టీమ్ ఇండియా మంచి ఫామ్‌లో ఉంది. ఈరోజు మేం ఉత్తమమైనదాన్ని అందించాల్సి ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
రెండు జట్ల ప్లేయింగ్-11..
View this post on Instagram
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కీపర్/కెప్టెన్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








