AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NED, ICC World Cup 2023 Highlights: ప్రపంచకప్‌లో వరుసగా 9వ విజయం.. చిత్తుగా ఓడిన డచ్ టీం..

India vs Netherlands, ICC world Cup 2023 Highlights: రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా, ప్రపంచ కప్ 2023లో తన విజయాల పరంపరను కొనసాగించింది. వరుసగా 9వ విజయాన్ని సాధించింది. టోర్నీ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు కూడా భారత్ బౌలింగ్‌లో వికెట్లు తీయడం విశేషం.

IND vs NED, ICC World Cup 2023 Highlights: ప్రపంచకప్‌లో వరుసగా 9వ విజయం.. చిత్తుగా ఓడిన డచ్ టీం..
India Vs Netherlands, 45th Match
Venkata Chari
|

Updated on: Nov 12, 2023 | 9:55 PM

Share

India vs Netherlands, ICC world Cup 2023 Highlights: 2023 ప్రపంచకప్‌లో భారత్ తన గెలుపు ప్రచారాన్ని కొనసాగిస్తోంది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 161 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసింది. అనంతరం నెదర్లాండ్స్ జట్టు 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది.

టీమిండియా తరపున శ్రేయాస్ అయ్యర్ అజేయంగా 128 పరుగులు, కేఎల్ రాహుల్ 102 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (61 పరుగులు), శుభమన్ గిల్ (51 పరుగులు), విరాట్ కోహ్లి (51 పరుగులు) అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడారు.

ప్రపంచకప్ 2023లో చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు 411 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ అందించింది. బెంగళూరులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసింది. నంబర్-4 శ్రేయాస్ అయ్యర్ ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించగా, ఈ టోర్నీలో కేఎల్ రాహుల్ రెండో సెంచరీ సాధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీలతో ఇన్నింగ్స్ ఆడారు. లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీకెరెన్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.

దీపావళి సందర్భంగా టీమ్ ఇండియా మ్యాచ్ ఆడడం భారత గడ్డపై గతంలో ఎన్నడూ జరగలేదు. కానీ, ఈసారి అది జరగబోతోంది. నవంబర్ 12న దేశం మొత్తం దీపాలు, బాణసంచా కాల్చి దీపావళిని జరుపుకోనున్న వేళ.. టీమ్ ఇండియా పరుగులతో దీపావళిని జరుపుకోనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. గ్రూప్ దశలో ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ భారత్‌ విజయం సాధించింది. ఈ రోజు గెలుపు సంఖ్యను 9 కి పెంచుకోవడానికి రోహిత్ సేన ప్రయత్నిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కీపర్/కెప్టెన్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 12 Nov 2023 09:33 PM (IST)

    9వ విజయం..

    2023 ప్రపంచకప్‌లో భారత్ తన గెలుపు ప్రచారాన్ని కొనసాగిస్తోంది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 161 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం.

  • 12 Nov 2023 09:20 PM (IST)

    8 వికెట్ డౌన్..

    నెదర్లాండ్స్ 44 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగులు చేసింది. తేజ నిడమనూరు, ఆర్యన్ దత్ క్రీజులో ఉన్నారు.

  • 12 Nov 2023 09:13 PM (IST)

    7 వికెట్ల నష్టానికి 208 పరుగులు

     నెదర్లాండ్స్ 42.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. తేజ ందమనూరు, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే క్రీజులో ఉన్నారు.

  • 12 Nov 2023 09:02 PM (IST)

    6 వికెట్లకు 200 పరుగులు

    నెదర్లాండ్స్ 41 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. తేజ నిడమనూరు, లోగన్ వాన్ బీక్ క్రీజులో ఉన్నారు.

  • 12 Nov 2023 08:30 PM (IST)

    5 వికెట్ల నష్టానికి 149 పరుగులు

    నెదర్లాండ్స్ 34 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెక్ట్, తేజ నిడమనూరు క్రీజులో ఉన్నారు.

  • 12 Nov 2023 08:05 PM (IST)

    2016లో వికెట్ తీసిన కోహ్లీ..

    విరాట్ కోహ్లీ చివరిసారిగా 2016 T20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ వికెట్ తీశాడు.

  • 12 Nov 2023 07:58 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన డచ్ టీం..

    నెదర్లాండ్స్ 25 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. 17 పరుగుల వద్ద స్కాట్ ఎడ్వర్డ్స్ ఔటయ్యాడు. అతను  విరాట్ కోహ్లీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. ప్రపంచకప్‌లో కోహ్లీకి ఇది తొలి వికెట్‌. అతని పేరు మీద 4 వన్డే వికెట్లు ఉన్నాయి.

  • 12 Nov 2023 07:31 PM (IST)

    3వ వికెట్ కోల్పోయిన డచ్ టీం..

    నెదర్లాండ్స్ 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్ క్రీజులో ఉన్నారు.

  • 12 Nov 2023 07:17 PM (IST)

    రెండు వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్..

    నెదర్లాండ్స్ 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, మాక్స్ ఓడౌడ్ క్రీజులో ఉన్నారు.

    కోలిన్ అకెర్‌మన్‌ (35 పరుగులు)ను కుల్దీప్ ఎల్‌బీడబ్ల్యూ చేశాడు. 4 పరుగుల వద్ద వెజ్లీ బరేసి ఔటయ్యాడు. వికెట్ కీపర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో రాహుల్ చేతికి చిక్కాడు.

  • 12 Nov 2023 05:49 PM (IST)

    నెదర్లాండ్స్ టార్గెట్ 411

    ప్రపంచకప్ 2023లో చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు 411 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ అందించింది. బెంగళూరులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసింది.

  • 12 Nov 2023 05:45 PM (IST)

    కేఎల్ రాహుల్ సెంచరీ..

    62 బంతుల్లో కేఎల్ రాహుల్ సెంచరీతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 11 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.

  • 12 Nov 2023 05:27 PM (IST)

    శ్రేయాస్ అయ్యర్ సెంచరీ..

    శ్రేయాస్ అయ్యర్ 84 బంతుల్లో సెంచరీ బాదేశాడు. ఇందులో 9 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 46 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 346 పరుగులు సాధించింది.

  • 12 Nov 2023 05:01 PM (IST)

    40 ఓవర్లకు భారత స్కోర్..

    40 ఓవర్లకు టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 284 పరుగులు సాధించింది. శ్రేయాస్ అయ్యర్ 73, రాహుల్ 37 పరుగులు సాధించింది.

  • 12 Nov 2023 04:47 PM (IST)

    వన్డేల్లో టాప్ 4 భారత బ్యాటర్ల హాఫ్ సెంచరీలు చేసిన సందర్భాలు.

    vs ENG, ఇండోర్, 2006

    vs ENG, లీడ్స్, 2007

    vs PAK, బర్మింగ్‌హామ్, 2017

    vs PAK, కొలంబో (RPS), 2023

    vs NED, బెంగళూరు, ఈరోజు*

  • 12 Nov 2023 04:36 PM (IST)

    ఇదే తొలిసారి..

    ఒకే ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో టాప్ 4 బ్యాటర్లందరూ 50+ పరుగులు చేయడం ఇదే తొలిసారి.

  • 12 Nov 2023 04:34 PM (IST)

    శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ..

    శ్రేయాస్ అయ్యర్ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో భారత్ 34 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది.

  • 12 Nov 2023 04:11 PM (IST)

    కోహ్లీ ఔట్..

    విరాట్ కోహ్లీ 51 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 28.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు పూర్తి చేసింది.

  • 12 Nov 2023 03:47 PM (IST)

    25 ఓవర్లకు..

    25 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. కోహ్లీ 45, అయ్యర్ 15 పరుగులతో నిలిచారు.

  • 12 Nov 2023 03:19 PM (IST)

    రోహిత్ ఔట్..

    రోహిత్ శర్మ 61 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 17.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది.

  • 12 Nov 2023 03:15 PM (IST)

    డ్రింక్స్ విరామం వరకు..

    డ్రింక్స్ విరామం వరకు టీమిండియా 17 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 123 పరుగులు చేసింది. రోహిత్ 61, కోహ్లీ 11 పరుగులతో నిలిచారు.

  • 12 Nov 2023 03:04 PM (IST)

    రోహిత్ హాఫ్ సెంచరీ..

    రోహిత్ శర్మ 44 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో 1 సిక్స్, 8 ఫోర్లు ఉన్నాయి. దీంతో భారత్ వికెట్ నష్టపోయి 14 ఓవర్లలో 109పరుగులు పూర్తి చేసింది.

  • 12 Nov 2023 02:52 PM (IST)

    గిల్ హాఫ్ సెంచరీ.. ఆ తర్వాత ఔట్..

    గిల్ కేవలం 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత పెవిలియన్ చేరాడు.

  • 12 Nov 2023 02:43 PM (IST)

    10 ఓవర్లలోనే తుఫాన్

    10 ఓవర్లు మగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 91 పరుగులు సాధించింది. రోహిత్ 42, గిల్ 47 పరుగులతో నిలిచారు.

  • 12 Nov 2023 02:26 PM (IST)

    50 పరుగులు దాటిన భారత్..

    టీమిండియాకు తొలి పవర్ ప్లేలో అద్భుతమైన ఆరంభం లభించింది. కేవలం 6 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. గిల్ 26, రోహిత్ 25 పరుగులతో నిలిచారు.

  • 12 Nov 2023 02:13 PM (IST)

    3 ఓవర్లకు భారత్ స్కోర్..

    3 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 26 పరుగులు పూర్తి చేసింది. రోహిత్ 16, గిల్ 9 పరుగులతో నిలిచారు.

  • 12 Nov 2023 01:39 PM (IST)

    ఇరు జట్లు:

    భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

    నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కీపర్/కెప్టెన్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్.

  • 12 Nov 2023 01:35 PM (IST)

    IND vs NED: టాస్ గెలిచిన భారత్..

    టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు లేవు.

  • 12 Nov 2023 01:30 PM (IST)

    9 విజయంపై కన్నేసిన భారత్..

    2023 ప్రపంచకప్‌లో 9-0తో విజయం సాధించాలని టీమ్ ఇండియా కన్నేసింది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడమే ఇందుకు కారణం. అంటే ప్రస్తుతం 8-0గా నిలిచింది. ఇప్పుడు భారత జట్టు మరో విజయాన్ని నమోదు చేస్తే.. ప్రపంచకప్ చరిత్రలో వరుస విజయాలతో సరికొత్త రికార్డుగా నిలిచిపోతుంది.

  • 12 Nov 2023 01:28 PM (IST)

    ప్రపంచకప్‌లో భారత్ vs నెదర్లాండ్స్ మ్యాచ్..

    వన్డే ప్రపంచకప్‌లో భారత్, నెదర్లాండ్స్ మధ్య ఇది ​​మూడో మ్యాచ్. ఇంతకు ముందు ఇరు జట్లు 2003, 2011 ప్రపంచకప్‌లలో తలపడ్డాయి. గతంలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది.

Published On - Nov 12,2023 1:20 PM