AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ఇంగ్లండ్‌తో ఐదో టీ20.. టాస్ ఓడిన టీమిండియా.. ఆ సీనియర్ ప్లేయర్ ఎంట్రీ

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-1తో కైవసం చేసుకుంది. కాబట్టి ఈ మ్యాచ్ కేవలం నామమాత్రమే. దీంతో భారత తుది జట్టులో పలు మార్పులు జరిగాయి.

IND vs ENG: ఇంగ్లండ్‌తో ఐదో టీ20.. టాస్ ఓడిన టీమిండియా.. ఆ సీనియర్ ప్లేయర్ ఎంట్రీ
IND vs ENG 5th T20I
Basha Shek
|

Updated on: Feb 02, 2025 | 7:15 PM

Share

భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్‌లో చివరిదైన ఐదో మ్యాచ్ ముంబై వేదికగా జరుగుతోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిని గెల్చుకున్న భారత్ 3-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. కాబట్టి ఈ మ్యాచ్ లాంఛనప్రాయం కాబట్టి భారత జట్టుపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. అయితే ఈ మ్యాచ్‌ కొందరి ఆటగాళ్లకు కీలకం కానుంది. ముఖ్యంగా పేలవమైన ఫామ్ తో సతమతమవుతోన్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. నాలుగు మ్యాచ్‌లలో పెద్దగా ఆకట్టుకోని మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ ఐదో మ్యాచ్‌లో నైనా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ చేస్తుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను ముగించాలని భారత ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఇంగ్లండ్ కనీసం ఈ మ్యాచ్ లో నైనా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.

ఇక ఈ మ్యాచ్ లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి స్థానం దక్కింది. అర్ష్ దీప్ సింగ్ ప్లేస్ లో అతనికి చోటు లభించింది. ఇక ఇంగ్లండ్ జట్టులోకి మార్క్ వుడ్ తిరిగి వచ్చాడు.

ఇవి కూడా చదవండి

తుది జట్టులో మహ్మద్ షమీకి స్థానం..

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, జామీ ఓవర్‌టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..