AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: అందరి కళ్లు ఆ ఆటగాళ్లపైనే.. బంగ్లాతో మొదటి వన్డేకు టీమిండియా సిద్ధం.. సంజూకు మళ్లీ నిరాశే

2022 టీ20 ప్రపంచకప్ నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చిన తర్వాత కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇదే తొలి సిరీస్. కాబట్టి  శిఖర్ ధావన్‌తో కలిసి హిట్ మ్యాన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.

IND vs BAN: అందరి కళ్లు ఆ ఆటగాళ్లపైనే.. బంగ్లాతో మొదటి వన్డేకు టీమిండియా సిద్ధం.. సంజూకు మళ్లీ నిరాశే
India Vs Bangladesh
Basha Shek
|

Updated on: Dec 03, 2022 | 7:06 PM

Share

కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఓటమిపాలైన టీమిండియా ఇప్పుడు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. వన్డే, టెస్ట్‌ సిరీస్‌లు ఆడేందుకు ఇప్పటికే రోహిత్ సేన అక్కడికి చేరుకుంది. ఆదివారం (డిసెంబర్‌4) మొదటి వన్డే జరగనుంది. టీ20 ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న పలువురు సీనియర్ ఆటగాళ్లు ఈ సిరీస్ ద్వారా మళ్లీ జట్టులోకి వచ్చారు. ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ టూర్‌లో విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి పునరాగమనం చేశారు. దీంతో  టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. కాగా 2022 టీ20 ప్రపంచకప్ నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చిన తర్వాత కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇదే తొలి సిరీస్. కాబట్టి  శిఖర్ ధావన్‌తో కలిసి హిట్ మ్యాన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఎప్పటిలాగే విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఆడనున్నాడు. అలాగే వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో ఆడే అవకాశం ఉంది. అప్పుడు శ్రేయాస్ అయ్యర్ 5వ స్థానంలో, రిషబ్ పంత్ 6వ స్థానంలో ఆడే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అయ్యర్ పరుగులు వర్షం కురిపించాడు కాబట్టి ఈ సిరీస్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించాలని ప్రయత్నిస్తున్నాడు.

పంత్‌కు ఆఖరి ఛాన్స్‌..

ఇక చాలా కాలంగా విఫలమవుతోన్న పంత్ ఈ సిరీస్‌లోనైనా రాణిస్తాడో లేదో వేచి చూడాలి. ఈ సిరీస్‌లో కూడా పంత్ సరిగా ఆడకపోతే టీమిండియాలో అతని స్థానం ఇక గల్లంతైనట్లే. ఇక బౌలింగ్ ఆల్ రౌండర్ కోటాలో కివీస్ టూర్‌లో రాణించిన వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉన్నాడు. అలాగే బంగ్లాదేశ్ పిచ్ లు స్పిన్నర్లకు మరింత సహకరిస్తాయి కాబట్టి ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. కాబట్టి అక్షర్ పటేల్ కూడా 8వ స్థానానికి ఎంపికయ్యే అవకాశం ఉంది. ప్లేయింగ్ ఎలెవన్‌లో మిగిలిన మూడు స్థానాలను పేసర్లు ఆక్రమిస్తారు. మహ్మద్ షమీ ఇప్పటికే భుజం గాయంతో దూరం కావడంతో.. పేసర్లుగా మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌లు బరిలోకి దిగాలని భావిస్తున్నారు. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌లకు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించే సామర్థ్యం ఉంది. కాబట్టి భారత బ్యాటింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. కొత్త బంతిని సిరాజ్, చాహర్ పంచుకోనుండగా మిగిలిన ఓవర్లలో శార్దూల్‌ను మూడో పేసర్‌గా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

తొలి వన్డే మ్యాచ్‌కి టీమిండియా కూర్పు ఇలా ఉండొచ్చు

  • ఓపెనర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్
  • మిడిల్ ఆర్డర్: విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్
  • లోయర్ మిడిల్ ఆర్డర్ : రిషబ్ పంత్ (వికెట్ కీపర్)
  • ఆల్ రౌండర్లు: వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్
  • పేపేసర్లు: శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్

టీమ్ ఇండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..