AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్.. కోహ్లీ, రోహిత్‌ల కల నెరవేరకుండానే రిటైర్మెంట్..?

India WTC Final Scenario: అడిలైడ్‌లో ఓటమి తర్వాత, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకోవడం అంత సులభం కాదు. పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో, టీమ్ ఇండియా మూడో స్థానంలో నిలిచాయి. ఇప్పుడు టీమిండియా ఫైనల్‌కి ఎలా చేరుతుందో తెలుసా?

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్.. కోహ్లీ, రోహిత్‌ల కల నెరవేరకుండానే రిటైర్మెంట్..?
Virat Kohli Rohit Sharma Wtc Trophy
Venkata Chari
|

Updated on: Dec 10, 2024 | 11:41 AM

Share

India WTC Final Scenario: శ్రీలంకపై దక్షిణాఫ్రికా 2-0తో విజయం సాధించడం, అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై ఘోర పరాజయం తర్వాత టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవడం కష్టంగా మారింది. తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. అదే సమయంలో ఆదివారం విజయంతో నంబర్ 1 స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు 24 గంటల తర్వాత తన స్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా విజయం తర్వాత ఇదంతా జరిగింది. అయితే, ఇక్కడ విశేషం ఏమిటంటే టీమిండియా ఇప్పటికీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవడానికి ఓ దారి ఉంది. అందుకోసం టీమిండియా ఏం చేయాలో ఓసారి చూద్దాం..

WTC ఫైనల్‌కు భారత్ ఎలా చేరుతుంది?

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకోవాలంటే.. ఆస్ట్రేలియా చేతిలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా ఉండడమే సులువైన మార్గం. ప్రస్తుతం టెస్టు సిరీస్‌ 1-1తో సమంగా ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా 4-1తో గెలిస్తేనే టీమిండియా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. ఇదొక్కటే కాదు, టీమిండియా 3-1 తేడాతో గెలిచినా, నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది.

విజయం సాధించినా.. ఇబ్బందులు తప్పవంతే..

టెస్టు సిరీస్‌ను 3-2తో టీమిండియా కైవసం చేసుకున్నప్పుడే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కి చేరడం సంక్లిష్టమవుతుంది. ఎందుకంటే ఈ తేడాతో సిరీస్ గెలిస్తే టీమిండియా ఫైనల్ చేరాలంటే శ్రీలంకపైనే ఆధారపడాల్సి ఉంటుంది. శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాను 1-0తో ఓడించినట్లయితేనే టీమిండియా ఫైనల్స్‌కు చేరుకోగలదు.

ఇవి కూడా చదవండి

ఇదే జరిగితే పాకిస్థాన్‌పై ఆధారపడాల్సిందే..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-2తో డ్రా చేసుకుంటే.. శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాను 2-0తో ఓడించాలని టీమిండియా ప్రార్థించాల్సి ఉంటుంది. మరోవైపు, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 2-3 తేడాతో ఓడిపోతే, పాకిస్థాన్-దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకోవడంతోపాటు శ్రీలంకపై ఆస్ట్రేలియా 2-0తో విజయం సాధించడం కోసం టీమిండియా ప్రార్థన చేయాల్సి ఉంటుంది. మరి ఫైనల్స్‌కు చేరేందుకు టీమిండియా ఏ మార్గాన్ని ఎంచుకుంటుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..