IND vs AUS Final: టీమిండియా దెబ్బకు.. ఆస్ట్రేలియాకు పాకిస్తాన్ గతే పట్టనుందా.. ఎందుకో తెలుసా?

ICC World Cup 2023: ఫైనల్‌కు ముందు, 2023 ప్రపంచకప్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో 4 మ్యాచ్‌లు జరిగాయి. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ కూడా అక్టోబర్ 5న ఈ మైదానంలోనే జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. దీని తరువాత, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా కూడా ఇక్కడ చెరో మ్యాచ్ ఆడాయి. రెండు జట్లు తమ మ్యాచ్‌లను గెలుచుకున్నాయి.

IND vs AUS Final: టీమిండియా దెబ్బకు.. ఆస్ట్రేలియాకు పాకిస్తాన్ గతే పట్టనుందా.. ఎందుకో తెలుసా?
India Vs Pakistan
Follow us
Venkata Chari

|

Updated on: Nov 18, 2023 | 8:17 PM

IND vs AUS Final: ప్రపంచ కప్ ఫైనల్ యాక్షన్ మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతుంది. నవంబర్ 19 ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. రెండు జట్లూ బలమైన ప్రదర్శనల తర్వాత ఇక్కడకు చేరుకున్నాయి. చివరి మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో.. వారిదే ట్రోఫీ. అయితే, ఇందులో పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అందులో ముఖ్యమైనది అహ్మదాబాద్ స్టేడియంలోని పిచ్. ఈ పిచ్ ఎలా ఉంటుందోనన్న చర్చలు సాగుతుండగా.. ఇప్పుడు తేలిపోయింది.

ఫైనల్‌కు ముందు, 2023 ప్రపంచకప్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో 4 మ్యాచ్‌లు జరిగాయి. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ కూడా అక్టోబర్ 5న ఈ మైదానంలోనే జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. దీని తరువాత, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా కూడా ఇక్కడ చెరో మ్యాచ్ ఆడాయి. రెండు జట్లు తమ మ్యాచ్‌లను గెలుచుకున్నాయి. టీం ఇండియా పాకిస్థాన్‌తో తలపడగా, రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు చాలా సులభంగా గెలిచింది.

పాకిస్థాన్‌తో జరిగిన పిచ్‌పైనే..

ఇప్పుడు ఫైనల్‌లోనూ భారత జట్టు పాకిస్థాన్‌పై ప్రదర్శించిన శైలినే ప్రదర్శించాలనుకుంటోంది. దీనికి కారణం కూడా ఉంది. పాకిస్థాన్‌ను టీమ్ ఇండియా ఏ పిచ్‌పై ఓడించిందో అదే పిచ్‌పై భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అక్టోబరు 14న భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా కేవలం 191 పరుగులకే పాకిస్థాన్‌ను చిత్తు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ స్పిన్ పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.

ఆస్ట్రేలియాకు కూడా అదే జరగబోతోందా..

View this post on Instagram

A post shared by ICC (@icc)

పిచ్ విషయానికొస్తే, ఇది నెమ్మదిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో, భారత స్పిన్నర్లు ఆస్ట్రేలియాను ఇబ్బంది పెట్టగలరని తెలుస్తోంది. శుక్ర, శనివారాల్లో ఈ నల్లమట్టి పిచ్‌పై హెవీ రోలర్‌లను ఉపయోగించారని, ఈ పిచ్ స్లోగా ఉంటుందనే దానికి స్పష్టమైన సూచన అని సమాచారం. ఈ పిచ్ స్లోగా ఉంటుందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు. అయితే పాకిస్థాన్ మ్యాచ్ తో పోలిస్తే ప్రస్తుతం పిచ్ పై పచ్చగడ్డి కనిపిస్తోందని రోహిత్ తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ 14న భారత స్పిన్నర్లు ఈ పిచ్‌పై అదే మ్యాజిక్‌ను చూపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..