ICC World Cup 2023: మహ్మద్ షమీ సొంతూరులో క్రికెట్ స్టేడియం.. యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ నిర్ణయం

మహ్మద్ షమీ.. వరల్డ్‌ కప్‌లో ఈ స్పీడ్‌ స్టర్‌ పేరు బాగా వినిపిస్తోంది. తన పదునైన బౌలింగ్‌తో టీమ్‌ఇండియాను ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడీ స్టార్‌ పేసర్. మాజీ దిగ్గజ క్రికెటర్ల నుండి ప్రధాని మోడీ వరకు ప్రముఖులు షమీ ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ కప్‌లో మహ్మద్ షమీ అత్యద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా అతని స్వస్థలం సహస్పూర్ అలీనగర్‌లో క్రికెట్ స్టేడియం నిర్మించాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం..

ICC World Cup 2023: మహ్మద్ షమీ సొంతూరులో క్రికెట్ స్టేడియం.. యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌  నిర్ణయం
Mohammad Shami, Yogi Adityanath
Follow us
Basha Shek

|

Updated on: Nov 18, 2023 | 8:10 PM

మహ్మద్ షమీ.. వరల్డ్‌ కప్‌లో ఈ స్పీడ్‌ స్టర్‌ పేరు బాగా వినిపిస్తోంది. తన పదునైన బౌలింగ్‌తో టీమ్‌ఇండియాను ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడీ స్టార్‌ పేసర్. మాజీ దిగ్గజ క్రికెటర్ల నుండి ప్రధాని మోడీ వరకు ప్రముఖులు షమీ ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ కప్‌లో మహ్మద్ షమీ అత్యద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా అతని స్వస్థలం సహస్పూర్ అలీనగర్‌లో క్రికెట్ స్టేడియం నిర్మించాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.మహ్మద్ షమీ స్వగ్రామమైన సహాపూర్ అలీనగర్‌లోని అమ్రోహాలో మినీ స్టేడియం మరియు ఓపెన్ జిమ్‌ను నిర్మించాలని అమ్రోహా జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. ఈ విషయమై అమ్రోహా జిల్లా మేజిస్ట్రేట్ రాజేష్ త్యాగి మాట్లాడుతూ.. మహ్మద్ షమీ గ్రామంలో మినీ స్టేడియం నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపుతున్నామని తెలిపారు. ఓపెన్ జిమ్నాసియం నిర్మించాలని కూడా ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ స్టేడియం నిర్మాణానికి కావాల్సినంత భూమి కూడా షమీ గ్రామంలో ఉందని తెలిపారు. కొన్ని రోజుల క్రితం, జిల్లా మేజిస్ట్రేట్ రాజేష్ త్యాగి, చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అమ్రోహా నేతృత్వంలోని జిల్లా పరిపాలన బృందం షమీ సాహసపురా అలీనగర్ గ్రామాన్ని సందర్శించింది. మినీ స్టేడియం, ఓపెన్ జిమ్ నిర్మించడానికి స్థలం వెతుకుతున్న బృందం అక్కడికి చేరుకుంది. జిల్లా మేజిస్ట్రేట్ మాట్లాడుతూ మహ్మద్ షమీ తరహాలో తమ ప్రాంత యువత క్రీడల్లో పురోగతి సాధించేలా చేయడమే తమ ధ్యేయమన్నారు. దీనిపై అమ్రోహా జిల్లా మేజిస్ట్రేట్ రాజేష్ త్యాగి మాట్లాడుతూ.. ‘రాష్ట్రవ్యాప్తంగా 20 స్టేడియాలను నిర్మించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి అమ్రోహా జిల్లాలోని మహ్మద్ షమీ గ్రామాన్ని కూడా స్టేడియం నిర్మించేందుకు ఎంపిక చేశాం’ అని తెలిపారు.

వాస్తవానికి, 2023 వన్డే ప్రపంచకప్‌లో మొదటి నాలుగు మ్యాచ్‌ల కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో మహ్మద్ షమీకి అనుమతి లేదు. అయితే హార్దిక్ పాండ్యా గాయపడటంతో షమీని జట్టులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో ఆడే అవకాశం దక్కించుకున్న షమీ.. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి సందడి చేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై నాలుగు, శ్రీలంకపై ఐదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో షమీ ఇద్దరు కివీస్ ఓపెనర్లను అవుట్ చేశాడు. తర్వాత నిర్ణీత వ్యవధిలో వికెట్లు తీసి మొత్తం ఏడు వికెట్లు తీశాడు. దీంతో 2023 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. అదే సమయంలో ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కూడా రికార్డు పుటల్లోకి ఎక్కాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..