IND Vs AUS: భారత స్పిన్ దెబ్బకు ఆస్ట్రేలియా ఫసక్.. 3 వికెట్లతో సత్తా చాటిన జడేజా.. టీమిండియా టార్గెట్ 200..
IND Vs AUS: ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో టీమిండియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. ఆదివారం చెన్నైలోని చెపాక్ మైదానంలో భారత స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ కలిసి ఆరుగురు కంగారూ బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపారు.

IND Vs AUS: ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో టీమిండియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. ఆదివారం చెన్నైలోని చెపాక్ మైదానంలో భారత స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ కలిసి ఆరుగురు కంగారూ బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపారు.
ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 41 పరుగులు, స్టీవ్ స్మిత్ 46 పరుగులు చేశారు. భారత జట్టులో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు తీశారు. రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.




కంగారూలకు షాక్ ఇచ్చిన బుమ్రా..
5 పరుగులకే మిచెల్ మార్ష్‌ను పెవిలియన్ చేర్చిన బుమ్రా.. కంగారులకు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 85 బంతుల్లో 69 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యంలో వార్నర్ 36(44), స్మిత్ 33(41) పరుగులు చేశారు. వార్నర్‌ను ఔట్ చేయడం ద్వారా కుల్దీప్ యాదవ్ ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు.
తొలి ఆటగాడిగా డేవిడ్ వార్నర్..
వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ నిలిచాడు. వార్నర్ ఇప్పటి వరకు ఆడిన 19 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును సాధించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్ (20 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది.
గిల్ స్థానంలో ఇషాన్‌కు అవకాశం..
శుభ్ మన్ గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయనున్నాడు. మూడు రోజుల క్రితం గిల్‌కి డెంగ్యూ జ్వరం వచ్చింది. కానీ, ఈరోజు వరకు అతను కోలుకోలేదు.
ఇరుజట్లు:
View this post on Instagram
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
జడేజా అద్భుత బౌలింగ్..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




