Ind vs Pak: దక్షిణాఫ్రికా గడ్డపై తలపడనున్న భారత్-పాక్.. మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. ఎప్పుడంటే?
ICC Women's World Cup 2023: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతుంది. భారత్-పాకిస్తాన్‌లను ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ని చూడాలనుకునే అభిమానులకు మరో శుభవార్త వచ్చింది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా గడ్డపై జరగనున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది. భారత్ , పాకిస్థాన్‌లు గ్రూప్ 2లో చోటు దక్కించుకున్నాయి. ఈ రెండింటితో పాటు ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి.
ఫిబ్రవరి 12న కేప్ టౌన్ వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్ ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ ఆతిథ్య దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక మధ్య కేప్ టౌన్‌లోనే జరగనుంది. గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉన్నాయి.
టీమ్ ఇండియా షెడ్యూల్ ..
పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడిన తర్వాత, టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ను వెస్టిండీస్‌తో కేప్‌టౌన్‌లోనే ఆడనుంది. దీని తరువాత ఫిబ్రవరి 18న ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ పోర్ట్ ఎలిజబెత్‌లో జరగనుంది.ప్రస్తుతం దీని పేరు ఇప్పుడు అబైఖాగా మార్చారు. ఒక రోజు తర్వాత అంటే ఫిబ్రవరి 20న భారత్ వర్సెస్ ఐర్లాండ్ ఇక్కడ తలపడనున్నాయి.
ఫార్మాట్..
రెండు గ్రూపుల జట్లు లీగ్ రౌండ్‌లో మ్యాచ్‌లు ఆడనున్నాయి. రెండు గ్రూపులలో టాప్-2లో నిలిచిన రెండు జట్లు సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశిస్తాయి. తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 23న కేప్ టౌన్‌లో జరగనుంది. ఫిబ్రవరి 24 రిజర్వ్ డే. కానీ, అదే రోజు రెండో సెమీఫైనల్ కూడా జరగనుంది. ఈ మ్యాచ్‌కి ఫిబ్రవరి 25 రిజర్వ్ డే. ఫిబ్రవరి 26న కేప్‌టౌన్‌లో ఫైనల్ జరగనుంది. దీనికి రిజర్వ్ డే ఫిబ్రవరి 27న నిర్ణయించారు.
Revealed ?️
Schedule for the ICC Women’s #T20WorldCup 2023 in South Africa is out ??https://t.co/BEaPA7XEhF
— ICC (@ICC) October 3, 2022
ఇప్పటి వరకు టైటిల్ గెలవని టీం ఇండియా..
భారత మహిళల జట్టు ఒక్కసారి కూడా వన్డే ప్రపంచకప్ గెలవలేదు. ఆ జట్టు రెండుసార్లు ఫైనల్‌లోకి ప్రవేశించినా విజయం చేజారిపోయింది. తొలిసారిగా 2005లో మిథాలీ రాజ్ సారథ్యంలో భారత జట్టు ప్రపంచకప్ ఫైనల్ ఆడినా విజయం సాధించలేకపోయింది. దీని తర్వాత, 2017లో మిథాలీ రాజ్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా మరో ఫైనల్ ఆడగా, ఈసారి ఇంగ్లండ్ భారత్ కలను చెరిపేసింది.
ఈసారి మిథాలీ, అత్యంత అనుభవజ్ఞురాలైన క్రీడాకారిణి జులన్ గోస్వామి లేకుండానే టీమ్ ఇండియా ఈ ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టనుంది. ఇద్దరు ఆటగాళ్లు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. కొద్ది రోజుల క్రితమే ఝులన్ తన చివరి వన్డే సిరీస్‌ని ఇంగ్లాండ్‌లో ఆడింది.