Yograj Singh: అర్జున్‌లో మరెంతో ప్రతిభ దాగి ఉంది.. సచిన్ కంటే గొప్పవాడవుతాడు: యువరాజ్ తండ్రి

యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ కఠినమైన ట్రైనర్‌గా పేరుగాంచాడు. ఆయన శిక్షణలోనే యువరాజ్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి, అంతర్జాతీయంగా పేరు సంపాదించాడు.

Yograj Singh: అర్జున్‌లో మరెంతో ప్రతిభ దాగి ఉంది.. సచిన్ కంటే గొప్పవాడవుతాడు: యువరాజ్ తండ్రి
Yograj Singh With Arjun Tendulkar
Follow us
Venkata Chari

|

Updated on: Dec 16, 2022 | 12:19 PM

అర్జున్ టెండూల్కర్ తన ఫస్ట్‌క్లాస్ అరంగేట్రంలోనే సెంచరీని కొట్టి, బుధవారం చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 34 సంవత్సరాల క్రితం సచిన్ సాధించిన ఫీట్‌ను రిపీట్ చేసిన అర్జున్.. తన తండ్రి సచిన్‌ను అనుకరించాడని అంతా భావిస్తున్నారు. అయితే, బ్యాటింగ్ సామర్థ్యాల కంటే బౌలింగ్‌కు పేరుగాంచిన అర్జున్‌ను.. యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ గుర్తించాడు. అర్జున్‌లోని టాలెంట్‌ను గుర్తించి, ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. ఈ క్రమంలో స్పోర్ట్స్ 9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, యోగరాజ్ అర్జున్‌లోని బ్యాటింగ్ సామర్థ్యాన్ని ఎలా గుర్తించాడో చెప్పుకొచ్చాడు. అలాగే అర్జున్్లోని బలమైన మనస్తత్వం, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో ఎంతోగానో సహాయపడ్డాడు.

యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ కఠినమైన ట్రైనర్‌గా పేరుగాంచాడు. ఆయన శిక్షణలోనే యువరాజ్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి, అంతర్జాతీయంగా పేరు సంపాదించాడు. అయితే, ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా మారడానికి సహాయపడిన తన తండ్రిని, ఆయన అందించిన కఠినమైన శిక్షణా సెషన్ల జ్ఞాపకాలను పదే పదే గుర్తుచేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అర్జున్ టెండూల్కర్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. మొదటి నుంచి బౌలింగ్‌లో ఉన్న అర్జున్.. మెరుగైన శిక్షణ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇదే సమయంలో ఛండిఘడ్ వచ్చిన అర్జున్‌కు.. యువరాజ్ తండ్రి యోగరాజ్ ట్రైనింగ్ ఇచ్చాడు.

“సెప్టెంబర్ మొదటి వారంలో, యువీ (యువరాజ్) నుంచి నాకు కాల్ వచ్చింది. ‘నాన్న, అర్జున్ రెండు వారాల పాటు చండీగఢ్‌లో ఉంటాడు. అతనికి శిక్షణ ఇవ్వడానికి మీకు సమయం ఉంటే, సచిన్ కోరిక మేరకు అర్జున్‌కు ట్రైనింగ్ ఇవ్వు’ అని చెప్పాడు. సచిన్‌కి నేను ఎలా నో చెప్పను. అతను నా పెద్ద కొడుకు లాంటివాడు. కానీ, నాకు ఒక షరతు ఉంది. నేను యువీతో, ‘నా శిక్షణా విధానం మీకు తెలుసు. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు’ అని యోగరాజ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

కొన్ని నెలల క్రితంనుంచే యోగరాజ్ ఆధ్వర్యంలో అర్జున్ శిక్షణ పొందుతున్నట్లు అనేక ఫొటోలు ఆన్‌లైన్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. జూనియర్ టెండూల్కర్ యోగరాజ్ సింగ్ మాటలను చాలా శ్రద్ధగా వింటూ, యోగరాజ్ సింగ్ క్రికెట్ అకాడమీలో అర్జున్ టెండూల్కర్ తన బ్యాటింగ్ స్కిల్స్‌పై తీవ్రంగా పని చేస్తూ.. చెమటలు పట్టించినట్లు ఆయన చెప్పుకొచ్చాడు.

సచిన్ కుమారుడు IPL 2021, 2022లో రెండు బ్యాక్-టు-బ్యాక్ సీజన్లలో ముంబై ఇండియన్స్ జట్టులో భాగమయ్యాడు. అయితే ఈ 2 సీజన్‌లలో దేనిలోనూ అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అర్జున్ ముంబై తరపున 2 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ, అతను ముంబై తరపున రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడలేదు. అందుకే అర్జున్ తన స్థావరాన్ని గోవాకు మార్చుకున్నాడు. రాబోయే రంజీ ట్రోఫీ సీజన్‌లో గోవా జట్టు కోసం ఆడతాడు.

7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్ పోర్వోరిమ్‌లోని గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో రెండో రోజు 207 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్సర్‌లతో 120 పరుగులు చేశాడు.

మరిన్ని అవకాశాల కోసం అర్జున్ ముంబై నుంచి గోవాకు మారాడు. 2013 సంవత్సరంలో అన్ని రకాల క్రికెట్‌ల నుంచి రిటైర్ అయిన సచిన్, 1988లో 15 ఏళ్ల వయస్సులో రంజీ ట్రోఫీలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరపున తన తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీని సాధించిన విషయం తెలిసిందే.

ఇంటర్వ్యూ పూర్తి వీడియో మీకోసం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..