Valentine’s Day: మైదానంలో నేనే కీపర్‌ని.. కానీ నా లైఫ్‌కు మాత్రం నువ్వే.. టీమిండియా బ్యాటర్ స్పెషల్ విషెస్

Valentine's Day: ఫిబ్రవరి 14 అంటేనే ప్రేమికులకు స్పెషల్ రోజు. ఎక్కడ చూసినా ప్రేమ జంటల హాడావుడి కనిపిస్తోంది. అయితే, క్రికెట్ ప్రపంచం కూడా దీని నుంచి తప్పించుకోలేదు. భారత ఆటగాళ్లు కూడా తమదైన శైలిలో ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ తమ భార్యలకు వాలెంటైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి స్టైల్‌ని ఫ్యాన్స్‌ బాగా ఇష్టపడుతున్నారు.

Valentine's Day: మైదానంలో నేనే కీపర్‌ని.. కానీ నా లైఫ్‌కు మాత్రం నువ్వే.. టీమిండియా బ్యాటర్ స్పెషల్ విషెస్
Dinesh Karthik Hardik Pandy
Follow us
Venkata Chari

|

Updated on: Feb 14, 2024 | 3:30 PM

Valentine’s Day, Hardik Pandya, Dinesh karthik: ప్రేమ పండుగగా పేరుగాంచిన ప్రేమికుల దినోత్సవాన్ని ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో, ప్రజలు తమ భాగస్వాములపై ​​ప్రేమను కురిపిస్తున్నారు. ఒకరినొకరు అభినందించుకోవడంతో విహారయాత్రలకు వెళ్లారు. క్రికెట్ ప్రపంచం కూడా దీని నుంచి తప్పించుకోలేదు. భారత ఆటగాళ్లు కూడా తమదైన శైలిలో ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ తమ భార్యలకు వాలెంటైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి స్టైల్‌ని ఫ్యాన్స్‌ బాగా ఇష్టపడుతున్నారు.

ప్రేమను కురిపించిన హార్దిక్..

హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో కలిసి సోషల్ మీడియాలో ఒక అందమైన ఫొటోను పంచుకున్నాడు. అతని కుమారుడు అగస్త్య కూడా ఫొటోలో కనిపిస్తున్నాడు. ఈ ఫోటో క్యాప్షన్‌లో హార్దిక్ ‘హ్యాపీ వాలెంటైన్స్ డే’ అంటూ రాసుకొచ్చాడు. దీనితో పాటు, అతను హార్ట్ ఎమోజీని కూడా జోడించాడు. ఈ జంట 31 మే 2020న వివాహం చేసుకున్నారు. అయితే, వారిద్దరూ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మరోసారి ఏడు అడుగులు వేశారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. నటాష్ సెర్బియా మోడల్ మరియు నటి అనే సంగతి తెలిసిందే. నటాషా 2012లో నటనా వృత్తిని కొనసాగించేందుకు భారతదేశానికి వచ్చింది.

హృదయాన్ని హత్తుకునే క్యాప్షన్‌తో దినేష్ కార్తీక్ ట్వీట్..

హార్దిక్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ కూడా తన ప్రేమను వ్యక్తపరచడంలో వెనుకంజ వేయలేదు. అతను తన భార్య స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌తో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఫొటోతో కూడిన క్యాప్షన్‌లో, కార్తీక్ తన ప్రేమను వ్యక్తం చేశాడు. ‘కీపర్‌గా, మైదానంలో రక్షకుడిగా ఉండటమే నా పని.. కానీ, ఈమె నా ఆనందానికి రక్షకురాలు’ అంటూ కార్తీక్ రాసుకొచ్చాడు. దీనితో పాటు, అతను హార్ట్ ఎమోజీని కూడా జోడించాడు. కార్తీక్ చేసిన ఈ పోస్ట్‌పై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..