AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

England playing 11: రాజ్‌కోట్ టెస్టులో ఇంగ్లండ్ ప్లేయింగ్ 11 ఇదే.. తిరిగొచ్చిన డేంజరస్ ప్లేయర్..

ENG Playing 11 3rd Test Against India: భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో గెలుపొందగా, విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్ ఫిబ్రవరి 15, గురువారం నుంచి రాజ్‌కోట్‌లో జరగనుంది.

England playing 11: రాజ్‌కోట్ టెస్టులో ఇంగ్లండ్ ప్లేయింగ్ 11 ఇదే.. తిరిగొచ్చిన డేంజరస్ ప్లేయర్..
England Cricket TeamImage Credit source: twitter
Venkata Chari
|

Updated on: Feb 14, 2024 | 3:55 PM

Share

England playing 11: భారత క్రికెట్ జట్టు, ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మూడవ మ్యాచ్ ఫిబ్రవరి 15, గురువారం నుంచి రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం ఇంగ్లీష్ జట్టు ఒక రోజు ముందే ప్లేయింగ్ 11ని ప్రకటించింది. అయితే, జట్టులో మార్పు వచ్చింది. షోయబ్ బషీర్ స్థానంలో మార్క్ వుడ్ జట్టులోకి వచ్చాడు. సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో గెలుపొందగా, విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు 106 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇంగ్లిష్ జట్టు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. తొలి టెస్టులో ఆడిన మార్క్ వుడ్ అనుకున్నంతగా రాణించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అతనికి వికెట్ దక్కలేదు. ఈ క్రమంలో రెండో టెస్టులో అండర్స్‌ను విశ్రాంతి ఇచ్చి, అనుభవజ్ఞుడైన జేమ్స్ అండర్సన్‌కు అవకాశం ఇచ్చారు. రెండో టెస్టులో అండర్సన్ 5 వికెట్లు తీశాడు. ఇక మూడో టెస్టులో ఈ ఇద్దరికీ అవకాశం దక్కింది. అలాగే, రెండో టెస్టులో అరంగేట్రం చేసిన ఇంగ్లిష్ యువ బ్యాట్స్‌మెన్ షోయబ్ బషీర్‌ను రాజ్‌కోట్ టెస్టుకు బెంచ్‌పై ఉంచారు. అరంగేట్రం టెస్టులోనే బషీర్ 4 వికెట్లు తీశాడు. మూడో టెస్టులో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో ఇంగ్లండ్ జట్టు రంగంలోకి దిగుతోంది.

మూడో టెస్టులో ఇంగ్లండ్ ప్లేయింగ్ 11..

జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫాక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.

ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫాక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, జేమ్స్ ఆండర్సన్, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్, డేనియల్ లావ్సన్ , గుస్ అట్కిన్సన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..