AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs CSK, IPL 2024: చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలతో 20 ఓవర్లలో 231 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన చెన్నై  గుజరాత్ జట్టు బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేయడంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 196 పరుగులు మాత్రమే చేయగలిగింది.

GT vs CSK, IPL 2024: చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం
Gujarat Titans vs Chennai Super Kings
Basha Shek
|

Updated on: May 11, 2024 | 12:02 AM

Share

Gujarat Titans vs Chennai Super Kings: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం ( మే10) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ మూడు వికెట్లు పడగొట్టడంతో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. దీంతో లీగ్ రౌండ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలతో 20 ఓవర్లలో 231 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన చెన్నై  గుజరాత్ జట్టు బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేయడంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 196 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై తరఫున డారిల్ మిచెల్ 63 పరుగులు, మొయిన్ అలీ 56 పరుగులు చేశారు. నాల్గో వికెట్‌కు ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల మధ్య 109 పరుగుల భాగస్వామ్యం ఉంది, కానీ మిచెల్ ఔట్ తర్వాత, చెన్నై ఇన్నింగ్స్ మరోసారి తడబడింది. దీనికి తోడు భారీ స్కోరు కావడంతో చెన్నైకు పరాజయం తప్పలేదు. గుజరాత్‌ బౌలర్లలో మోహిత్‌ శర్మ 3, రషీద్‌ ఖాన్‌ 2, ఉమేశ్‌, సందీప్‌ వారియర్‌ చెరో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి

సిక్స్ లతో అలరించిన ధోని.. వీడియో.

ఇరు జట్ల ప్లేయింగ్ XI ఇదిగో…

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగి

ఇంపాక్ట్  ప్లేయర్లు:

అభినవ్ మనోహర్, సందీప్ వారియర్, BR శరత్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

రుతురాజ్ గైక్వాడ్ (సి), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (w), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్

ఇంపాక్ట్  ప్లేయర్లు:

అజింక్యా రహానే, షేక్ రషీద్, అరవెల్లి అవనీష్, సమీర్ రిజ్వీ, ముఖేష్ చౌదరి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..