IPL 2024, KKR vs MI: ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా.. ఇరుజట్ల రికార్డులు ఎలా ఉన్నాయంటే?
Kolkata Knight Riders vs Mumbai Indians, 60th Match Preview: ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 33 మ్యాచ్‌లు జరగ్గా అందులో ముంబై 23 మ్యాచ్‌లు గెలుపొందగా, కేకేఆర్ 10 మ్యాచ్‌లు గెలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు జరగ్గా, అందులో ముంబై 7 గెలిచి, KKR 3 గెలిచింది. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ముంబైపై కోల్‌కత్తాదే పైచేయి కనిపిస్తోంది.

Kolkata Knight Riders vs Mumbai Indians, 60th Match Preview: IPL 2024లో, కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ శనివారం, మే 11న మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని చారిత్రాత్మక మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. క్రికెట్ అభిమానులందరూ ఈ మ్యాచ్‌పై దృష్టి సారిస్తారు. మరోవైపు, KKR ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని ధృవీకరించింది. మరోవైపు, టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. కాగా, కోల్‌కత్తా 8 విజయాలతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై 4 విజయాలు, 8 ఓటములతో 8వ స్థానంలో ఉంది. ఒకవైపు ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే కేకేఆర్‌కి కేవలం ఒక్క విజయం మాత్రమే కావాలి. అదే సమయంలో ముంబై ఇప్పటికే టాప్ 4 రేసులో లేదు. ఇటీవల ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ చరిత్రలో ముంబై, కోల్‌కతా మధ్య ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 33 మ్యాచ్‌లు జరగ్గా అందులో ముంబై 23 మ్యాచ్‌లు గెలుపొందగా, కేకేఆర్ 10 మ్యాచ్‌లు గెలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు జరగ్గా, అందులో ముంబై 7 గెలిచి, KKR 3 గెలిచింది. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ముంబైపై కోల్‌కత్తాదే పైచేయి కనిపిస్తోంది.
ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..
కోల్‌కత్తా నైట్ రైడర్స్: ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రమణదీప్ సింగ్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా.




ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, నువాన్ తుషార, జస్ప్రీత్ బుమ్రా.
పిచ్, వాతావరణం..
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్, మైదానంలో ఎప్పుడూ తీవ్రమైన పోటీ కనిపిస్తుంది. ఇక్కడ బ్యాట్స్‌మెన్‌లు ఆరంభంలో దూకుడిగా ఆడే అవకాశం ఉంది. స్పిన్ బౌలర్లకు కూడా చాలా సాయం అందుతుంది. ఈడెన్ గార్డెన్స్‌లో సగటు స్కోరు దాదాపు 160. వాతావరణం గురించి మాట్లాడితే, ఉష్ణోగ్రత 25 ° C ఉంటుంది. మంచు తక్కువగా ఉండే అవకాశం ఉంది.
మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం..
మ్యాచ్ టాస్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు జరుగుతుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఈ మ్యాచ్‌ను టీవీలో ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక డిజిటల్‌గా జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




