Gautam Gambhir: టీమిండియా కోచ్‌గా గంభీర్.. ఆ సీనియర్ ప్లేయర్లు బ్యాగులు సర్దేసుకోవాల్సిందే

కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్, టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ త్వరలో భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెలాఖరులో బీసీసీఐ దీనిపై పెద్ద ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ఉన్నారు.

Gautam Gambhir: టీమిండియా కోచ్‌గా గంభీర్.. ఆ సీనియర్ ప్లేయర్లు బ్యాగులు సర్దేసుకోవాల్సిందే
Gautam Gambhir
Follow us
Basha Shek

|

Updated on: Jun 18, 2024 | 1:42 PM

కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్, టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ త్వరలో భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెలాఖరులో బీసీసీఐ దీనిపై పెద్ద ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ఉన్నారు. 2024 టీ-20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత భారత జట్టు బాధ్యత కొత్త కోచ్‌గా వచ్చే గంభీర్ తీసుకోనున్నారు. మీడియా కథనాల ప్రకారం, గౌతమ్ గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అంతకు ముందు ఒక పెద్ద షరతు పెట్టాడు గౌతీ. బీసీసీఐ కూడా గంభీర్ షరతులకు అంగీకరించినట్లు సమాచారం. అందుకే గౌతమ్ గంభీర్ కోచ్‌గా వచ్చిన వెంటనే టీమ్‌ఇండియాలో పెను మార్పులు సంభవించవచ్చు. దీనికి సంబంధించి బీసీసీఐ, గౌతమ్ గంభీర్ మధ్య ఒప్పందం కుదిరిందని సమాచారం.

కాగా రాహుల్ ద్రవిడ్ తన కోచింగ్‌లో, జట్టు సహాయక సిబ్బందిలో బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్‌గా పరాస్ మహంబ్రే, టి. దిలీప్‌ను చేర్చుకున్నారు. అయితే గౌతమ్ గంభీర్ వచ్చాక వీరందరూ బయటకు వెళ్లనున్నారు. టీమిండియా కోచింగ్ సపోర్టు స్టాఫ్‌ని గంభీర్ స్వయంగా ఎంపిక చేస్తారని సమాచారం. గౌతమ్ గంభీర్ ఐపీఎల్ 2024 ఛాంపియన్‌ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా ఉన్నాడు. అతను ఇప్పుడు పూర్తి సమయం క్రికెట్‌పై దృష్టి సారిస్తానని చెప్పాడు. అందుకే ఎంపీకి పోటీ చేయకూడదని కూడా నిర్ణయించుకున్నారు. గౌతమ్ గంభీర్ కోచింగ్‌కు ముందు KKR కెప్టెన్‌గా ఉన్నప్పుడు రెండుసార్లు IPL టైటిల్‌ను గెలుచుకున్నాడు. 2012, 2014లో గౌతమ్ గంభీర్ నాయకత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది.

నలుగురు ఆటగాళ్లు ఔట్..

మీడియా కథనాల ప్రకారం, గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ అయిన వెంటనే, నలుగురు భారత ఆటగాళ్లకు ఉద్వాసన తప్పకపోవచ్చని తెలుస్తోంది. ఈ నలుగురు ఆటగాళ్లు ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదు. ప్రధానంగా టీ 20 ల నుంచి కోహ్లీ, రోహిత్, జడేజాలను తప్పింవచ్చని తెలుస్తోంది. వీరికి ఇదే ఆఖరి ప్రపంచకప్ అని తెలుస్తోంది. గంభీర్ ఇప్పటి వరకు ఏ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించలేదు. ఐపీఎల్‌లో లక్నో, కేకేఆర్‌లకు మెంటార్‌గా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో గంభీర్ తొలిసారిగా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..