Sudigali Sudheer: గుడ్ న్యూస్ చెప్పనున్న సుడిగాలి సుధీర్.. ప్రొడ్యూసర్ కూతురితో పెళ్లి..

కమెడియన్ గా కెరీర్ మొదలై పెట్టి ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు సుధీర్. స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు ఈ టాలెంటడ్ నటుడు. కమెడియన్ గా , యాంకర్ గా ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు. త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకోనున్నాడని తెలుస్తుంది.

Sudigali Sudheer: గుడ్ న్యూస్ చెప్పనున్న సుడిగాలి సుధీర్.. ప్రొడ్యూసర్ కూతురితో పెళ్లి..
Sudigali Sudheer
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 18, 2024 | 3:48 PM

టీవీ షోల ద్వారా పాపులర్ అయినా వారు చాలా మంది మంది ఉన్నారు. బుల్లితెర నుంచి వెండితెరపై అవకాశాలు అందుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ పాపులర్ అయ్యాడు. ఈ కామెడీ షోలో  స్కిట్స్ తో ప్రేక్షకులను మెప్పించాడు. ముందుగా వేణు టీమ్ లో చిన్న చిన్న రోల్స్ చేసిన సుధీర్ ఆతర్వాత మెయిన్ గా మారాడు. ఆతర్వాత టీమ్ లీడర్ గా మారాడు. తన స్కిట్స్ తోనే కాదు యాంకర్ గాను ప్రేక్షకులను అలరించాడు సుడిగాలి సుధీర్. ఇక ఇప్పుడు హీరోగా  మారి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన సుధీర్. ఆతర్వాత హీరోగా సినిమాలు చేశాడు. ఇదిలా ఉంటే సుధీర్ పెళ్లి గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి సుడిగాలి సుధీర్ పెళ్లి గురించిన న్యూస్ వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి అరాచకం రా సామీ..! ఈ హాట్ బ్యూటీ.. 3 మూవీలో శ్రుతిహాసన్ చెల్లెలా..!!

సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ ప్రేమలో ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి. జబర్దస్త్ షోలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ టీవీ షోల్లోనూ వీరి మధ్య ప్రేమ ఉన్నట్టు చూపించడం, లవ్ సాంగ్స్ వేయడంతో అందరూ నిజగానే ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట

గతంలో ఓ షోలో వీరిద్దరికీ పెళ్లి కూడా చేశారు. కానీ అది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని సుదీర్, రష్మీ క్లారిటీ ఇచ్చారు. కాగా ఇప్పుడు సుదీర్ పెళ్ళికి సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కూతురితో సుడిగాలి సుధీర్ పెళ్లి అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. త్వరలో సుధీర్ పెళ్లి గురించిన అప్డేట్ వస్తుందని అంటున్నారు. మరి వీటిలో నిజమెంతుందో తెలియాలంటే సుధీర్ క్లారిటీ ఇవ్వాల్సిందే. సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సుదీర్ హీరోగా నటించిన గోట్ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమాలో దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి : బాబోయ్.. ఈ వయసులోనూ ఇలా ఉందేంటీ..!! సాహోలో నటించిన ఈ నటి గుర్తుందా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.