IND vs AUS: భారత్, ఆసీస్ టీ20 పోరులో తోపు ప్లేయర్లు వీరే.. టాప్ 5 లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..
India vs Australia T20I Series: రెండు దేశాల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లలో టీం ఇండియా అత్యధిక విజయాలు సాధించింది. అయితే, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత జట్టులో ఇప్పుడు భాగం కాని ఒక ఆటగాడు కూడా ఈ లిస్టులో ఉన్నాడు. అతను ఇప్పటికీ అత్యధిక పరుగులు చేయడంలో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఎల్లప్పుడూ ఉత్కంఠభరితమైన పోరుగానే ఉంటుంది. రెండు జట్లలోనూ మోస్ట్ పవర్ ఫుల్ ఆటగాళ్ళు ఉన్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్కంఠ పోరులో భారత జట్టుదే పైచేయిగా నిలిచింది. రెండు దేశాల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లలో టీం ఇండియా అత్యధిక విజయాలు సాధించింది. అయితే, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత జట్టులో ఇప్పుడు భాగం కాని ఒక ఆటగాడు కూడా ఈ లిస్టులో ఉన్నాడు. అతను ఇప్పటికీ అత్యధిక పరుగులు చేయడంలో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు.
1. విరాట్ కోహ్లీ: ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ తన కెరీర్‌లో ఆస్ట్రేలియాపై 23 టీ20 మ్యాచ్‌లు ఆడి 49.70 సగటుతో 794 పరుగులు చేశాడు. కోహ్లీ ఆస్ట్రేలియాపై ఎనిమిది అర్ధ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 90.
2. గ్లెన్ మాక్స్వెల్: ఆస్ట్రేలియాకు చెందిన డేంజరస్ బ్యాట్స్‌మన్ గ్లెన్ మాక్స్‌వెల్ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నాడు. అతను ఆస్ట్రేలియా తరపున తన తుఫాన్ బ్యాటింగ్, ఆల్ రౌండ్ ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందాడు. అతను భారత్‌తో జరిగిన 22 టీ20 మ్యాచ్‌ల్లో 31.88 సగటుతో 574 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో కూడా అతను తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నాడు.
3. ఆరోన్ ఫించ్: ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మూడవ స్థానంలో ఉన్నాడు. అతను భారత్‌పై చాలా పరుగులు చేశాడు. మొత్తం 18 మ్యాచ్‌ల్లో 27.89 సగటుతో 500 పరుగులు సాధించాడు. ఫించ్ ఇప్పుడు టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.
4. మాథ్యూ వేడ్: ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ మాథ్యూ వేడ్ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నాడు. వాడే 17 టీ20 మ్యాచ్ ల్లో 488 పరుగులు చేశాడు. భారత్ పై అతని సగటు 54.67. అతను 2024 లో టీ20 క్రికెట్ నుంచి రిటైర్ కావడం గమనార్హం.
5. రోహిత్ శర్మ: ఈ జాబితాలో రోహిత్ శర్మ ఐదవ, చివరి స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 23 టీ20 మ్యాచ్‌ల్లో 28.90 సగటుతో 484 పరుగులు చేశాడు. రోహిత్ ఇప్పుడు టీ20 అంతర్జాతీయాల నుంచి రిటైర్ అయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








