AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

W,W,W,W,W,W,W.. 24 బంతుల్లో 7 వికెట్లు.. హ్యాట్రిక్ లేకుండానే టీ20ఐలో భారీ రికార్డ్..

Unbreakable Cricket Records: ఏడు వికెట్లు పడగొట్టడం టీ20లో డబుల్ సెంచరీకి సమానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఫార్మాట్‌లో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. ఓ ప్లేయర్ తన 4 ఓవర్లలో 7 వికెట్లు తీసి చరిత్రలో సంచలనం సృష్టించాడు.

W,W,W,W,W,W,W.. 24 బంతుల్లో 7 వికెట్లు.. హ్యాట్రిక్ లేకుండానే టీ20ఐలో భారీ రికార్డ్..
Cricket Records
Venkata Chari
|

Updated on: Oct 28, 2025 | 4:16 PM

Share

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించడం అనేది ఒక బౌలర్‌కు బ్యాటర్ సాధించిన సెంచరీ కంటే తక్కువేం కాదు. అయితే, కొద్దిమంది మాత్రమే ఈ ఘనతను సాధించారు. అయితే, ఈ హ్యాట్రిక్‌తోపాటు దాదాపు 6 వికెట్లు తీసిన బౌలర్లు క్రికెట్ హిస్టరీలో ఉన్నారు. కానీ, 7 వికెట్లు తీసిన బౌలర్ ఒకే ఒక్కడు ఉన్నాడు. దీంతో ఈ రికార్డ్ టీ20లో డబుల్ సెంచరీకి సమానం అనడంలో ఎలాంటి సందేహం లేదని భావిస్తున్నారు. పొట్టి ఫార్మాట్‌లో ఏడు వికెట్లు తీయడం ద్వారా చరిత్రలో సంచలనం సృష్టించిన ఏకైక బౌలర్ ఉన్నారని మీకు తెలుసా..? ఈ రికార్డ్ గురించి వివరంగా తెలుసుకుందాం..

2023లో తిరుగులేని రికార్డు..

2023లో, ఒక బౌలర్ ఒకే టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన రికార్డును సృష్టించాడు. ఈ ఘనతను బద్దలు కొట్టడం అసాధ్యం అనిపిస్తుంది. చైనా, మలేషియా మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్ ఆసియా బీ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఈ రికార్డు సాధించాడు. చైనా కేవలం 23 పరుగులకే ఆలౌట్ అయింది. చైనా బ్యాట్స్‌మెన్స్ మలేషియా బౌలర్ ముందు తేలిపోయారు.

ఆ బౌలర్ ఎవరు?

మలేషియా ఆల్ రౌండర్ సయాజ్రుల్ ఇడ్రస్ ఈ అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. అతను వచ్చిన వెంటనే చైనా బ్యాటింగ్ లైనప్‌ను పూర్తిగా నాశనం చేశాడు. మలేషియా కెప్టెన్ నాల్గవ ఓవర్‌లో సయాజ్రుల్‌కు బంతిని అందించాడు. అతను తన మొదటి ఓవర్‌లోనే నలుగురు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. ఆ తర్వాత ఆరో ఓవర్‌లో బౌలింగ్‌కు తిరిగి వచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. సయాజ్రుల్ వికెట్ తీయడం తన చివరి ఓవర్‌లో కూడా కొనసాగింది. ఆ ఓవర్‌లో కూడా రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

6 వికెట్లు తీసిన రికార్డులో చాలామంది పేర్లు..

గతంలో, ఒక టీ20ఐ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును పలువురు బౌలర్లు సంయుక్తంగా కలిగి ఉన్నారు. ఈ బౌలర్లలో ఎవరూ ఆరు వికెట్లకు మించి తీయలేదు. చరిత్రలో నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏడు వికెట్లు తీసిన ఏకైక బౌలర్ ఇడ్రస్. ఒకే టీ20ఐ ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన ఘనతను ముగ్గురు భారతీయ బౌలర్లు సాధించారు. వారిలో దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్ ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..