DC vs SRH , IPL 2024: ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టిన హైదరాబాద్.. ఢిల్లీపై ఘన విజయం..
Delhi Capitals vs Sunrisers Hyderabad: ఐపీఎల్ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థి జట్లకు సవాల్ విసురుతోంది. తాజాగా శనివారం (ఏప్రిల్ 21) రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన 35వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది
Delhi Capitals vs Sunrisers Hyderabad: ఐపీఎల్ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థి జట్లకు సవాల్ విసురుతోంది. తాజాగా శనివారం (ఏప్రిల్ 21) రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన 35వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యఛేదనలో దిల్లీ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. జేక్ ఫ్రేజర్ (18 బంతుల్లో 65, 5 ఫోర్లు, 7 సిక్స్ లు ), అభిషేక్ పోరెల్ ( 22 బంతుల్లో 42, 7 ఫోర్లు, ఒక సిక్స్) క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. రిషబ్ పంత్ (34 బంతుల్లో 44, 5 ఫోర్లు, ఒక సిక్స్) చాలా సేపు క్రీజులో ఉన్నా దూకుడుగా ఆడలేకపోయాడు. మిగతా బ్యాటర్లు రాణించకపోవడం, భారీ లక్ష్య ఛేదన కావడంతో ఢిల్లీకి పరాభవం తప్పలేదు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 4, మయాంక్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 2, భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్‌లకు తలో వికెట్ దక్కింది. ఐపీఎల్ 2024 లో హైదరాబాద్‌కు ఇది ఐదో విజయం. అదే సమయంలో ఢిల్లీకి ఐదో ఓటమి.
అంతకు ముందు ట్రావిస్ హెడ్ 89, అభిషేక్ శర్మ 46 పరుగులు చేశారు. ఇద్దరూ తొలి వికెట్‌కు 131 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరూ అవుటైన తర్వాత మిడిలార్డర్ నిరాశపర్చింది. దీంతో హైదరాబాద్ రన్ రేట్ నెమ్మదించింది. నితీష్ రెడ్డి 37, హెన్రిక్ క్లాసెన్ 15, ఐడాన్ మర్క్రామ్ 1 రనౌట్ అయ్యారు. అయితే తర్వాత షాబాజ్ అహ్మద్ ఎట్టకేలకు భారీ షాట్లు కొట్టి హైదరాబాద్ 250కి చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. షాబాజ్ 59 పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్ 13 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీశాడు. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో వికెట్ కోల్పోయారు.
Celebrations in the @SunRisers camp as they wrap 🆙 a massive win with that wicket of the #DC skipper 🙌
With that, they move to the 2️⃣nd spot on the Points Table 🧡
Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvSRH pic.twitter.com/Ou5g1Tgi55
— IndianPremierLeague (@IPL) April 20, 2024
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్:
పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐదాన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్.
ఇంపాక్ట్ ప్లేయర్లు:
ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఆకాష్ మహరాజ్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్
ఢిల్లీ ప్లేయింగ్ XI:
రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ఎన్రిక్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.
ఇంపాక్ట్ ప్లేయర్లు:
పృథ్వీ షా, షాయ్ హోప్, ప్రవీణ్ దూబే, రసిఖ్ దార్ సలామ్, సుమిత్ కుమార్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి