DC vs SRH, IPL 2024: 18 ఫోర్లు, 22 సిక్సర్లు.. హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
Delhi Capitals vs Sunrisers Hyderabad: హైదరాబాదీ బ్యాటర్లు మళ్లీ అదరగొట్టారు. ఢిల్లీ బౌలర్లను చితగొడుతూ మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఓపెనర్లు హెడ్ (32 బంతుల్లో 89 11 ఫోర్లు,6 సిక్స్ లు), అభిషేక్ శర్మ( 12 బంతుల్లో 46, 2 ఫోర్లు, 6 సిక్సర్లు) పెను విధ్వంసం సృష్టించారు
Delhi Capitals vs Sunrisers Hyderabad: హైదరాబాదీ బ్యాటర్లు మళ్లీ అదరగొట్టారు. ఢిల్లీ బౌలర్లను చితగొడుతూ మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఓపెనర్లు హెడ్ (32 బంతుల్లో 89 11 ఫోర్లు,6 సిక్స్ లు), అభిషేక్ శర్మ( 12 బంతుల్లో 46, 2 ఫోర్లు, 6 సిక్సర్లు) పెను విధ్వంసం సృష్టించారు. ఆఖర్లో షాబాద్ అహ్మద్ ( 29 బంతుల్లో 59 నాటౌట్, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. తెలుగబ్బాయి నితీశ్ రెడ్డి (37) కూడా ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. ఐడెన్ మార్‌క్రమ్ (1), హెన్రిచ్ క్లాసెన్ (15), సమద్ (13), పాట్ కమిన్స్ (1) నిరాశ పర్చడంతో చివరి ఓవర్లలో హైదరాబాద్ పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో కుల్‌దీప్ 4 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.
ఈ సీజన్ లో మూడో సారి 250 కు పైగా రన్స్..
Making striking look easy, the @SunRisers batters 🧡
ఇవి కూడా చదవండి250 up for #SRH for the 3rd time in the season 🔥
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvSRH pic.twitter.com/3R0N6AWdNP
— IndianPremierLeague (@IPL) April 20, 2024
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్:
పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐదాన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్.
ఇంపాక్ట్ ప్లేయర్లు:
ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఆకాష్ మహరాజ్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్
ఢిల్లీ ప్లేయింగ్ XI:
రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ఎన్రిక్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.
ఇంపాక్ట్ ప్లేయర్లు:
పృథ్వీ షా, షాయ్ హోప్, ప్రవీణ్ దూబే, రసిఖ్ దార్ సలామ్, సుమిత్ కుమార్
నాలుగు వికెట్లు తీసిన కుల్ దీప్ యాదవ్..
What a turnaround this from @DelhiCapitals 👏👏
Kuldeep Yadav gets the dangerous Travis Head while Axar Patel gets Heinrich Klaasen 👌👌
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 #TATAIPL | #DCvSRH pic.twitter.com/mmJIBB2uEq
— IndianPremierLeague (@IPL) April 20, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి