Rishabh Pant: ‘నువ్వు దేవుడివి సామీ’.. పేద విద్యార్థి చదువు కోసం రిషబ్ పంత్ ఏం చేశాడో తెలుసా?
టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ తన డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతమున్న యంగ్ క్రికెటర్లలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన క్రికెటర్లలో పంత్ కూడా ఒకడు. రోడ్డు ప్రమాదంలో మృత్యువు అంచుల దాకా వెళ్లొచ్చి మరీ గ్రౌండ్ లోకి అడుగు పెట్టిన రిషబ్ పంత్ అంటే చాలా మందికి స్ఫూర్తి దాయకం.

టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ తన డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతమున్న యంగ్ క్రికెటర్లలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన క్రికెటర్లలో పంత్ కూడా ఒకడు. రోడ్డు ప్రమాదంలో మృత్యువు అంచుల దాకా వెళ్లొచ్చి మరీ గ్రౌండ్ లోకి అడుగు పెట్టిన రిషబ్ పంత్ అంటే చాలా మందికి స్ఫూర్తి దాయకం. ఈ టీమిండియా క్రికెటర్ ఆటతోనే కాదు అప్పుడప్పుడూ తన సేవా కార్యక్రమాలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం చేస్తుంటాడు. ఇటీవలే సొంతంగా యూట్యూబ్ ఛానెల్ కు స్టార్ట్ చేసిన రిషబ్.. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు అనౌన్స్ చేశాడు. యూట్యూబ్ ఆదాయానికి తన పర్సనల్ కాంట్రిబ్యూషన్ కూడా కలిపి పలు సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్లు తెలిపాడు. దీంతో పంత్ మంచి మనసుకు చాలా మంది ఫిదా అయ్యారు. అలా తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడీ టీమిండియా డ్యాషింగ్ క్రికెటర్. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే రిషబ్ పంత్.. ఇటీవల సరదాగా తన అభిమానులతో ముచ్చటించాడట. ఇదే సందర్భంలో ఇంజినీరింగ్ చదువుకుంటున్న ఓ యువకుడు తన కాలేజ్ ఫీజ్ కోసం డబ్బులు కావాలని రిషబ్ ను అడిగాడట. దీనికి స్పందించిన ఈ యంగ్ క్రికెటర్ విద్యార్థికి కావాల్సిన మొత్తాన్ని వెంటనే అందజేశాడట. సుమారు 90 వేల రూపాయలు పేద విద్యార్థికి పంపించాడట.
the student requested 90k to pay his college fee through social media , the news went through rishabhpant & the student has happy face throughout his life time ❤️ RISHABH PANT for a reason 🗿🫡 proud to be you’re fan pic.twitter.com/GPiPgRyRIc
— Nithin (@rishabhattach) August 27, 2024
ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. పంత్ చేసిన మంచి పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు.
Rishabh Pant has donated the money for the education of an engineering student who was asking for help in Social media 👌
– Pant, winning the heart as always. pic.twitter.com/SNMCR39wIE
— Johns. (@CricCrazyJohns) August 27, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




