Jay Shah: అంతర్జాతీయ క్రికెట్ మండలి కొత్త ఛైర్మన్‌గా జై షా.. చిన్న వయస్సులోనే
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కొత్త ఛైర్మన్‌గా బిసిసిఐ కార్యదర్శి జై షా నియమితులయ్యారు. గ్రెగ్ బార్క్లే తర్వాత జై షా బాధ్యతలు చేపట్టనున్నారు. జగ్‌మోహన్ దాల్మియా (అధ్యక్షుడు), శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, షాహంక్ మనోహర్ తర్వాత క్రికెట్ గ్లోబల్ గవర్నింగ్ అథారిటీకి నాయకత్వం వహించిన ఐదవ భారతీయుడిగా షా నిలిచారు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కొత్త ఛైర్మన్‌గా బిసిసిఐ కార్యదర్శి జై షా నియమితులయ్యారు. గ్రెగ్ బార్క్లే తర్వాత జై షా బాధ్యతలు చేపట్టనున్నారు. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న ఆయన.. ఐసీసీ ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగ్‌మోహన్ దాల్మియా (అధ్యక్షుడు), శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, షాహంక్ మనోహర్ తర్వాత క్రికెట్ గ్లోబల్ గవర్నింగ్ అథారిటీకి నాయకత్వం వహించిన ఐదవ భారతీయుడిగా షా నిలిచారు. 34 ఏళ్ల వయసులో ఐసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా షా నిలిచారు. గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగుస్తుంది.. కావున, జై షా డిసెంబర్ 1న బాధ్యతలు చేపట్టనున్నారు.. అంతకుముందు, గ్రెగ్ బార్క్లే 2020లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2022లో మళ్లీ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగుస్తున్నందున ఈసారి ఎన్నికలను నిర్వహించారు.
ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్ క్లే మూడోసారి బరిలో ఉండకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.. అయితే.. చైర్మన్ పదవి కోసం నామినేషన్ల గడవు ముగిసింది.. చైర్మన్ పదవికి ఏకైక నామినీగా జై షా నిలవడంతో.. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఐసీసీ ప్రకటించింది. అయితే.. క్రికెట్ ను మరింత విస్తృతం చేసేందుకు .. అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జైషా ప్రకటించారు.
BCCI Secretary Jay Shah has been elected unopposed as the next Independent Chair of the International Cricket Council (ICC). He will assume this role on December 1, 2024: ICC pic.twitter.com/W3ca8MMAYw
— ANI (@ANI) August 27, 2024
ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైషా.. ఐసిసి కొత్త ఛైర్మన్ గా ఎన్నికకావడం పట్ల పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..