WPL 2026 Auction: పూర్తిగా మారిన డబ్ల్యూపీఎల్ టీంలు.. డేంజరస్ ప్లేయర్లతో మోస్ట్ పవర్ ఫుల్ టీం ఏదంటే?
WPL 2026 Auction: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నాల్గవ ఎడిషన్ జనవరి 9 నుండి ఫిబ్రవరి 5, 2026 వరకు జరుగుతుంది. డీవై పాటిల్ స్టేడియం, నవీ ముంబై, వడోదర రెండు ఆతిథ్య వేదికలుగా నిర్ధారించారు. కాగా, ఈ సీజన్ ఫిబ్రవరి 5న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. భారతదేశం అంతటా మరో నెల రోజుల ఎలైట్ మహిళల టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నాల్గవ ఎడిషన్ జనవరి 9 నుండి ఫిబ్రవరి 5, 2026 వరకు జరుగుతుంది. డీవై పాటిల్ స్టేడియం, నవీ ముంబై, వడోదర రెండు ఆతిథ్య వేదికలుగా నిర్ధారించారు. కాగా, ఈ సీజన్ ఫిబ్రవరి 5న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. భారతదేశం అంతటా మరో నెల రోజుల ఎలైట్ మహిళల టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన డబ్ల్యూపీఎల్ 2025 వేలంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ వేలంలో అభిమానులు ఎనిమిది మంది మార్క్యూ ఆటగాళ్లపైనే ఎక్కువగా దృష్టి నిలిచింది. ఆ మార్క్యూ ఆటగాళ్లలో ఇద్దరు భారతీయ ఆటగాళ్ళు ఉన్నారు. మార్క్యూ ఆటగాళ్ల జాబితాలో దీప్తి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్ వంటి ఆటగాళ్ళు ఉన్నారు. తాజా వేలంలో కొత్త ఆటగాళ్ల చేరికతో అన్ని టీంలు మారిపోయాయి. ఇఫ్పటి వరకు వేలంలో 12 సెట్లు పూర్తయ్యాయి. దీంతో కొత్తగా చేరిన ప్లేయర్లతో అన్ని టీంలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
12 సెట్లు పూర్తయ్యాయిన తర్వాత జట్ల వివరాలు..
ముంబై ఇండియన్స్ (మిగిలిన మొత్తం: రూ. 0.80 కోట్లు)
హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ స్కివర్-బ్రంట్, హేలీ మాథ్యూస్, అమంజోత్ కౌర్, జి. కమలిని, అమేలియా కెర్, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా, సజన సజీవన్, రహిలా ఫిర్దౌస్, నికోలా కేరీ
ఢిల్లీ క్యాపిటల్స్ (మిగిలిన మొత్తం: రూ.0.80 కోట్లు)
జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, అన్నాబెల్ సదర్లాండ్, మార్జియానే కప్ప్, నికి ప్రసాద్, లారా వోల్వార్డ్ట్, చినెల్లే హెన్రీ, శ్రీ చరణి, స్నేహ రాణా, లిజెల్ లీ, దీయా యాదవ్, తానియా భాటియా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (మిగిలిన మొత్తం: రూ. 1.25 కోట్లు)
స్మృతి మంధాన, రిచా ఘోష్, ఎల్లీస్ పెర్రీ, శ్రేయాంక పాటిల్, జార్జియా వోల్, నాడిన్ డి క్లెర్క్, రాధా యాదవ్, లారెన్ బెల్, లిన్సే స్మిత్, ప్రేమ రావత్, అరుందజతి రెడ్డి, పూజా వస్త్రాకర్
గుజరాత్ జెయింట్స్ (మిగిలిన మొత్తం: రూ. 2.55 కోట్లు)
ఆష్లీ గార్డనర్, బెత్ మూనీ, సోఫీ డివైన్, రేణుకా సింగ్ ఠాకూర్, భారతీ ఫుల్మాలి, టిటాస్ సాధు, కాషీ గౌతమ్, కనికా అహుజా, తనూజా కన్వర్, జార్జియా వేర్‌హామ్, అనుష్క శర్మ
యుపి వారియర్జ్ (మిగిలిన మొత్తం: రూ. 1.45 కోట్లు)
శ్వేతా సెహ్రావత్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, మెగ్ లానింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, కిరణ్ నవ్‌గిరే, హర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్, ఆశా శోభన, డియాండ్రా డోటిన్, శిఖా పాండే
పూర్తి జాబితా వేలం తర్వాత అందిస్తాం..
మరన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




