AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Border-gavaskar trophy: భారత బ్యాటర్లు ఆస్ట్రేలియా పేస్ దాడిని తట్టుకోగలరా? మాజీ ఆస్ట్రేలియా ఆటగాడి హెచ్చరిక

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందుగా, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హడ్డిన్ భారత బ్యాటింగ్ లైన్-అప్‌ కు ఆసీస్ పేస్ దాడిని తట్టుకునే శక్తి లేదని పేర్కొన్నాడు, ప్రత్యేకించి పెర్త్ బౌన్స్ భారత బ్యాటర్లకు సవాలుగా మారుతుందని అన్నాడు. హడ్డిన్ అభిప్రాయానికి భిన్నంగా, మాజీ కెప్టెన్ అరోన్ ఫించ్ రెండు జట్ల టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పాడు. రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం అనుమానాస్పదం కావడంతో, జైస్వాల్‌కు ఓపెనింగ్ పార్ట్నర్ ఎంపిక టీమిండియాకు పెద్ద సవాలుగా మారింది.

Border-gavaskar trophy:  భారత బ్యాటర్లు ఆస్ట్రేలియా పేస్ దాడిని తట్టుకోగలరా? మాజీ ఆస్ట్రేలియా ఆటగాడి హెచ్చరిక
Border Gavaskar Trophy 2024 25
Narsimha
|

Updated on: Nov 13, 2024 | 8:51 PM

Share

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ వివాదస్పద కామెంట్స్ చేశాడు. భారత బ్యాటింగ్ లైనప్‌ కు ఆస్ట్రేలియా పేస్ దాడిని ఎదుర్కొనగల సత్తా లేదని ఆరోపించాడు. పెర్త్‌లో ఉండే అనూహ్య బౌన్స్ భారత బ్యాటర్లకు, ముఖ్యంగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌కు పెద్ద సవాలుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. భారత బ్యాటర్లు ఆసీస్ బౌలర్ల పేస్ ను తట్టుకుని నిలబడగలరని తాను అనుకోవడం లేదని అన్నాడు. పెర్త్‌లో ఓపెనింగ్ చేయడం చాలా కష్టమన్న హడిన్ జైస్వాల్ టాలెంటెడ్ ఆటగాడే కానీ, అతను ఇంతవరకు ఆస్ట్రేలియాలో ఆడలేదు. పెర్త్ పిచ్‌పై బౌన్స్‌ను సరిగా ఎదుర్కొనడం అతనికి కష్టతరమవుతుంది” అని అన్నాడు.

హడిన్ కామెంట్స్ కి భిన్నంగా ఆసీస్ మాజీ కెప్టెన్ అరోన్ ఫించ్ స్పందించాడు. భారత పేసర్లను ఎదుర్కొనే విషయంలో ఆసీస్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ కి కూడా ఇబ్బందులు తప్పని అభిప్రాయపడ్డారు. ఆ లెక్కన ఇరు జట్ల ఓపెనర్లకు ఇబ్బందులు తప్పకపోచ్చని పేర్కొన్నాడు. ఒక వేళ ఇరు జట్లలో టాప్ ఆర్డర్ విఫలమయితే అలెక్స్ కేరీ, రిషభ్ పంత్ కీలకమయ్యే ఛాన్స్ ఉందని అన్నాడు. ఇద్దరూ దూకుడైన బ్యాట్స్‌మెన్ కాబట్టి వీరు తమ ఆట తీరుతో మ్యాచ్ ను మలుపుతిప్పే అవకాముందని ఫించ్ అభిప్రాయపడ్డారు.

మొదటి టెస్ట్‌కి కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం అనుమానంగా ఉండటంతో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు భాగస్వామిని సెట్ చేసే పనిలో బీసీసీఐ పడింది. ప్రస్థుతానికి అందుబాటులో ఉన్న KL రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ లలో ఒకరిని ఓపెనింగ్ పంపాలన్ని నిర్ణయానికి వచ్చింది. అయితే వీరిద్దరు ఆస్ట్రేలియాలో భారత A తరపున ఆడిన మ్యాచ్ లో విఫలమయ్యారు. దీంతో జైస్వాల్ కు తోడుగా ఓపెనింగ్ చేసేది ఎవరనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్ అవడంతో ఇప్పుడు BGT కి ముందు టీమిండియా బ్యాటింగ్ లైనప్ పైపదే పదే విమర్శలు వస్తున్నాయి.