AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer: కరుణించిన బీసీసీఐ! శ్రేయస్ అయ్యర్‌ సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో సంచలన నిర్ణయం

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు ఆడాడు శ్రేయస్ అయ్యర్. ఆ తర్వాత గాయం కారణంగా జట్టు నుంచి బయటకు వచ్చాడు. అయితే ఎన్‌సీఏలో చేరిన అయ్యర్ కోలుకున్న తర్వాత రంజీ ఆడాలని సూచించింది బీసీసీఐ. అయితే తాను ఫిట్ గా లేనంటూ రంజీకి దూరమయ్యాడు

Shreyas Iyer: కరుణించిన బీసీసీఐ!  శ్రేయస్ అయ్యర్‌ సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో సంచలన నిర్ణయం
Shreyas Iyer
Basha Shek
|

Updated on: Mar 15, 2024 | 12:09 PM

Share

టీమిండియా యంగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను బీసీసీఐ కరుణించిందా? అతని సెంట్రల్ కాంట్రాక్ట్ ను మళ్లీ పునరుద్ధరించే ఆలోచనలో ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రంజీ ట్రోఫీలో ముంబై త‌ర‌ఫున సెమీ ఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచుల్లో బ‌రిలోకి దిగాడు అయ్యర్. ఫైన‌ల్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన 95 ప‌రుగులు చేసి ముంబై విజ‌యంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో సెంట్రల్ కాంట్రాక్టులో మళ్లీ శ్రేయస్ అయ్యర్ పేరును చేర్చేందుకు బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే టీమిండియాలోకి శ్రేయస్ ఎంట్రీ లాంఛనప్రాయమే. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు ఆడాడు శ్రేయస్ అయ్యర్. ఆ తర్వాత గాయం కారణంగా జట్టు నుంచి బయటకు వచ్చాడు. అయితే ఎన్‌సీఏలో చేరిన అయ్యర్ కోలుకున్న తర్వాత రంజీ ఆడాలని సూచించింది బీసీసీఐ. అయితే తాను ఫిట్ గా లేనంటూ రంజీకి దూరమయ్యాడు. అదే అయ్యర్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని NCA అధికారులు నివేదించడంతో, BCCI ఈ టీమిండియా బ్యాటర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

నోటీసు తర్వాత కూడా రంజీ ఆడని శ్రేయాస్ అయ్యర్‌ను బీసీసీఐ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. ఆ తర్వాత కాంట్రాక్టు నుంచి తప్పుకుని రంజీల్లోకి అడుగుపెట్టిన అయ్యర్.. ముంబై జట్టును చాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. సెమీఫైనల్‌, ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో పెద్దగా ఆడని అయ్యర్.. ఆఖరి మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 95 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ముంబై జట్టును చాంపియన్‌గా నిలపడంలో అయ్యర్‌ ఇన్నింగ్స్‌ కీలక పాత్ర పోషించిందన్న ప్రశంసలు వచ్చాయి. దీంతో ఇప్పుడు మళ్లీ బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ కూడా చేరనున్నాడని వినిపిస్తోంది. దీనిపై పలు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేశాయి. ్కాగా రంజీ ఫైనల్లో గాయపడిన అయ్యర్ ఫీల్డింగ్ చేయలేదు. దీంతో అయ్యర్ గాయం తీవ్రంగా ఉందని, అతను ఈసారి కూడా ఐపీఎల్ ఆడడం అనుమానంగానే ఉందని పుకార్లు వచ్చాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం శుక్రవారం (మార్చి15) అయ్యర్ KKR జట్టులో చేరనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?