T20 World Cup 2024: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ కోసం అదనపు టికెట్లు..బుక్ చేసుకోండిలా
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను ఈ ఏడాది వెస్టిండీస్, యూఎస్‌ఏల్లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రపంచకప్ టిక్కెట్లపై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ప్రపంచకప్‌లో 37 ప్రారంభ మ్యాచ్‌ల టిక్కెట్లను ఫిబ్రవరి 1న ప్రకటించింది ఐసీసీ .

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను ఈ ఏడాది వెస్టిండీస్, యూఎస్‌ఏల్లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రపంచకప్ టిక్కెట్లపై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ప్రపంచకప్‌లో 37 ప్రారంభ మ్యాచ్‌ల టిక్కెట్లను ఫిబ్రవరి 1న ఐసీసీ ప్రకటించింది. ఆ తర్వాత టిక్కెట్లు అమ్ముడుపోయాయి. దీంతో ఇప్పుడు క్రికెట్ అభిమానుల కోసం ఐసీసీ అదనపు టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇది కాకుండా మరో 13 మ్యాచ్‌లకు టిక్కెట్లను ప్రకటించింది. T20 వరల్డ్ కప్ 2024 అదనపు టిక్కెట్‌లను మార్చి 19 నుండి బుక్ చేసుకోవచ్చు. ఆరోజు రాత్రి 7 గంటల నుంచి టికెట్ బుకింగ్ చేసుకోవచ్చని ఐసీసీ సూచించింది. ఇందులో ప్రపంచకప్ ఓపెనింగ్ సెర్మనీని వీక్షించే అవకాశం కల్పించారు. టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి అభిమానులు ముందుగా టీ 20 ప్రపంచకప్ అధికారిక వెబ్ సైట్ ఖాతాను క్రియేట్ చేసుకోవాలి. వెస్టిండీస్‌లో కొన్ని మ్యాచ్‌ల ధరలు దాదాపు US$6 నుండి ప్రారంభమవుతాయి. అమెరికాలో జరిగే మ్యాచ్‌కు టిక్కెట్లు 35 అమెరికన్ డాలర్ల నుంచి ప్రారంభమవుతాయి.
ఇదిలా ఉంటే ప్రపంచకప్‌కు సంబంధించిన 55 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లకు టిక్కెట్లు అందుబాటులో లేవు. వీటిలో USA vs కెనడా (జూన్ 1), ఇండియా vs పాకిస్తాన్ (జూన్ 9), ఇండియా vs కెనడా (జూన్ 15), బార్బడోస్‌లో జరిగే ఫైనల్ (జూన్ 15) ఉన్నాయి. 29) మ్యాచ్ లు ఉన్నాయి. వీటిలో రెండు మ్యాచ్ లకు ఇప్పుడు టికెట్లు అందుబాటులోకి రానుండగా, మరో రెండు మ్యాచ్ ల టికెట్లు అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
Additional tickets for this year’s #T20WorldCup in the West Indies and USA will be available for purchase from Tuesday 19 March 👀
More 👇https://t.co/KdQaKAajkf pic.twitter.com/YHNjqGs3xu
— ICC (@ICC) March 15, 2024
టీమిండియా షెడ్యూల్..
- జూన్ 5: భారతదేశం vs ఐర్లాండ్, నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్
- జూన్ 9: భారతదేశం vs పాకిస్తాన్ , నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్
- జూన్ 12: భారతదేశం vs యునైటెడ్ స్టేట్స్, నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్
- జూన్ 15: ఇండియా vs కెనడా, సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, లాడర్‌హిల్, ఫ్లోరిడా (మ్యాచ్ లన్నీ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి)
Australia great Ricky Ponting can’t wait to see India against Pakistan in New York at the #T20WorldCup 2024 💥
More 👉 https://t.co/jxMrNCUWnu pic.twitter.com/KoAVmsiO3O
— ICC (@ICC) March 15, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








