Watch Video: నాటౌట్, ఔట్ అంటూ కన్ఫ్యూజన్ రిజల్ట్స్.. థర్డ్ అంపైర్ వింత నిర్ణయాలపై నెటిజన్స్ ఫైర్.. వైరల్ వీడియో
ఆస్ట్రేలియన్ టీ20 లీగ్ బిగ్ బాష్ ఛాలెంజర్ మ్యాచ్ సిడ్నీ సిక్సర్స్ vs బ్రిస్బేన్ హీట్ మధ్య ఫిబ్రవరి 2, గురువారం జరిగింది. ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఆస్ట్రేలియన్ టీ20 లీగ్ బిగ్ బాష్ ఛాలెంజర్ మ్యాచ్ సిడ్నీ సిక్సర్స్ vs బ్రిస్బేన్ హీట్ మధ్య ఫిబ్రవరి 2, గురువారం జరిగింది. ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయంతో అందరూ ఆశ్చర్యపోయారు. జోష్ ఫిలిప్ వికెట్ కోసం బ్రిస్బేన్ హీట్ అప్పీల్ చేసినప్పుడు సిడ్నీ సిక్సర్స్ బ్యాటింగ్ సమయంలో ఈ వింత నిర్ణయం కనిపించింది. డీఆర్‌ఎస్ కోసం డిమాండ్ చేసిన తర్వాత, అంపైర్ మొదట ఫిలిప్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ, ఆటగాళ్లు మళ్లీ అప్పీల్ చేయడంతో, థర్డ్ అంపైర్ అతని స్వంత నిర్ణయాన్ని రద్దు చేసి అతనిని అవుట్‌గా ప్రకటించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
పవర్‌ప్లే తర్వాత మొదటి బంతికి, ఫిలిప్ మాథ్యూ కుహ్న్‌మాన్ ఆఫ్ బంతిని స్వీప్ చేయాలనుకున్నాడు. కానీ, అలా చేయలేకపోయాడు. బ్రిస్బేన్ హీట్ ఆటగాళ్లు ఎల్‌బీడబ్ల్యూ అవుట్ కోసం అంపైర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే అంపైర్ వారి అప్పీల్‌ను తిరస్కరించారు. అప్పుడు బ్రిస్బేన్ బృందం డీఆర్ఎస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. థర్డ్ అంపైర్ రీప్లేలో బంతి అతని ప్యాడ్‌లకు తగలలేదని, గ్లవ్స్‌కు తగలలేదని గుర్తించారు. అటువంటి పరిస్థితిలో, థర్డ్ అంపైర్ తన తీర్పును ఇస్తూ ఫిలిప్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు.




ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. వాస్తవానికి, రివ్యూ తీసుకున్న తర్వాత, థర్డ్ అంపైర్ ప్రతిదీ తనిఖీ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆటగాడు అవుట్ అయ్యాడా లేదా అనేది తెలుస్తుంది. థర్డ్ అంపైర్ ఇక్కడ ఎల్బీడబ్ల్యూ మాత్రమే చెక్ చేశాడు. అయితే వికెట్ కీపర్ క్యాచ్ పట్టాడా లేదా అని తనిఖీ చేయడం మర్చిపోయాడు. ఆటగాళ్లు మళ్లీ అప్పీల్ చేయడంతో థర్డ్ అంపైర్ రీప్లేలో బంతి గ్లవ్స్‌కు తగిలి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని ఫిలిప్స్‌ను అవుట్‌గా ప్రకటించాడు.
What a review from Brisbane!
The lbw was ruled out due to a little spike – but Jimmy Peirson held the catch! #BBL12 pic.twitter.com/jifHTMorW3
— cricket.com.au (@cricketcomau) February 2, 2023
మ్యాచ్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ 4 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. 10 బంతులు మిగిలి ఉండగానే బ్రిస్బేన్ ఈ స్కోరును సాధించింది. 48 పరుగులతో మైఖేల్ నేజర్ అజేయ ఇన్నింగ్స్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
