MS Dhoni as Police: ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేసిన ధోని.. కొత్త పాత్రలో నెట్టింట్లో సందడి.. వైరల్ ఫొటో..
Mahendra Singh Dhoni: తన కెప్టెన్సీలో టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్ వైరల్ అవుతోంది. అతను పోలీసు అధికారి యూనిఫాంలో కనిపిస్తున్నాడు.

భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడూ తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూనే ఉంటుంటాడు. ఈసారి కూడా తన అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు. దీంతో ధోనీ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో మాజీ ప్రపంచకప్ విజేత పోలీసు అధికారి యూనిఫాంలో కనిపిస్తున్నాడు.
దీంతో ఫ్యాన్స్, నెజిటన్లు ధోని ఎప్పుడు పోలీస్ అయ్యాడంటూ కామెంట్లు పంచుకుంటున్నారు. అయితే, నిజానికి ధోనీ పోలీస్ ఆఫీసర్‌గా మారలేదు. అలాగే ధోనీ కూడా సినిమాల్లోకి అడుగు పెట్టలేదు. మహి నిరంతరం వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తూనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా అలాంటిదే జరిగింది. ఓ ప్రకటనలో ధోనీ పోలీస్ ఆఫీసర్‌గా మారాడు.




సోషల్ మీడియాలో వైరల్‌గా ధోనీ లుక్..
MS Dhoni as a police officer in an ad. pic.twitter.com/nleS9DR8bh
— Johns. (@CricCrazyJohns) February 2, 2023
ఈ ప్రకటనలో పోలీస్ అధికారిగా ధోనీ లుక్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ధోనీ కొత్త లుక్‌ని అభిమానులు ఇష్టపడుతున్నారు. ధోనీ కొత్త లుక్‌ని అభిమానులు తెగ షేర్ చేసుకున్నారు. ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు.
MS Dhoni as police for an ad ! ?@MSDhoni #MSDhoni #WhistlePodu pic.twitter.com/QKCTHUUtVo
— DHONI Era™ ? (@TheDhoniEra) February 2, 2023
ధోని 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. అప్పటి నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మాత్రమే ఆడటం కనిపిస్తుంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టుకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మహి ఇప్పుడు IPL 2023 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..