T20 World Cup: 4సార్లు సెమీస్, ఓసారి ఫైనల్.. అందని ద్రాక్షగానే ట్రోఫీ.. టీమిండియా గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
Women's T20 World Cup 2023: మహిళల టీ20 ప్రపంచకప్ 2023 ఫిబ్రవరి 10 నుంచి దక్షిణాఫ్రికాలో ప్రారంభం కానుంది. ఈసారి ఛాంపియన్‌గా నిలవాలనే ఆశ టీమ్‌ఇండియాలో బలంగా కనిపిస్తోంది.

టీ20 ప్రపంచకప్ 2023కి ముందు భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత ఫామ్‌లో కనిపిస్తోంది. ఫిబ్రవరి 10 నుంచి దక్షిణాఫ్రికాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, అంతకు ముందు మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఇప్పటి వరకు కలసిరాలేదు. 7 సార్లు జరిగిన ఈ టోర్నీలో 4 సార్లు సెమీ ఫైనల్, ఒకసారి ఫైనల్ ఆడినా.. ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్ టైటిల్‌ను అందుకోలేకపోయింది.
భారత జట్టు తన తొలి టీ20 ప్రపంచకప్ 2023 మ్యాచ్‌ని ఫిబ్రవరి 12న ఆడనుంది. ఈ మ్యాచ్ పాకిస్థాన్‌తో జరగనుంది. అంటే తొలి మ్యాచ్ నుంచే టీమిండియాపై ఒత్తిడి ఉంటుంది. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందో టోర్నీ ప్రారంభానికి ముందే తెలుసుకుందాం.
2009లో ఇంగ్లండ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. నాకౌట్ మ్యాచ్‌లో 52 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 93 పరుగులకే ఆలౌటైంది.




2010లో వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో టీమిండియా మరోసారి ఓటమిపాలైంది. ఈసారి ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది.
2012లో శ్రీలంకలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఈ జట్టు ఈసారి నాకౌట్‌కు చేరుకోలేదు. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.
2014లో బంగ్లాదేశ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మరోసారి సెమీఫైనల్‌లోకి ప్రవేశించలేకపోయింది. ఈసారి గ్రూప్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన జట్టు కేవలం 2 మాత్రమే గెలవగలిగింది.
2016లో టీమిండియా మరోసారి సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఈసారి ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించగా గ్రూప్ దశలో 4 మ్యాచ్‌ల్లో 3 ఓడిపోయింది.
2018 T20 ప్రపంచ కప్ వెస్టిండీస్‌లో జరిగింది. ఈసారి మళ్లీ సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. మరోసారి టీం ప్రయాణం ఇక్కడే ముగిసింది. ఈసారి ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది.
2020లో టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరిగింది. ఈసారి టోర్నీలో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ, ఆతిథ్య ఆస్ట్రేలియా మాత్రం ఛాంపియన్ కావాలన్న టీమిండియా కలను చెరిపేసింది. 185 పరుగుల లక్ష్యం ముందు టీమిండియా కేవలం 99 పరుగులకే ఆలౌటైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..