AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఓవైపు బ్లాక్ బస్టర్ ఇన్నింగ్స్‌లు.. మరోవైపు ఏళ్లనాటి రికార్డులకు బ్రేకులు.. పఠాన్‌తో ఉన్న ఈ లవర్ బాయ్ ఎవరో తెలుసా?

భారతదేశంలో క్రికెట్‌కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇతర క్రీడలను డామినేట్ చేస్తూ, బిలియన్ డాలర్ల వ్యాపారంతో క్రికెట్ దూసుకపోతోంది. ఈ క్రమంలో దేశంలో మొదలైన ఐపీఎల్‌తో యువ క్రీడాకారులు సత్తా చాటుతూ.. టీమిండియాలో చోటు దక్కించుకుంటున్నారు.

Team India: ఓవైపు బ్లాక్ బస్టర్ ఇన్నింగ్స్‌లు.. మరోవైపు ఏళ్లనాటి రికార్డులకు బ్రేకులు.. పఠాన్‌తో ఉన్న ఈ లవర్ బాయ్ ఎవరో తెలుసా?
Team India Cricketer
Venkata Chari
|

Updated on: Feb 03, 2023 | 12:20 PM

Share

23 ఏళ్ల ఈ యంగ్ ప్లేయర్ భారత క్రికెట్‌కు కొత్త స్టార్‌గా మారాడు. టెస్టు మ్యాచ్‌ అయినా, టీ20, వన్డే క్రికెట్‌ అయినా.. ఎక్కడ చూసినా ఈ యంగ్ ప్లేయర్ బ్యాట్‌ పవర్‌ కనిపిస్తోంది. టీమ్ ఇండియా పరివర్తనలో భాగంగా భవిష్యత్తు కోసం ఆటగాళ్లను సన్నద్ధం చేయడం చూస్తుంటే, ఈ యంగ్ ప్లేయర్ నిలకడగా పరుగులు, మెరుగైన ప్రదర్శన చేస్తూ.. భారత అభిమానుల ఆశలను రేకెత్తిస్తున్నాడు.

భారతదేశంలో క్రికెట్‌కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇతర క్రీడలను డామినేట్ చేస్తూ, బిలియన్ డాలర్ల వ్యాపారంతో క్రికెట్ దూసుకపోతోంది. ఈ క్రమంలో దేశంలో మొదలైన ఐపీఎల్‌తో యువ క్రీడాకారులు సత్తా చాటుతూ.. టీమిండియాలో చోటు దక్కించుకుంటున్నారు. ఇలాంటి వారిలో చాలామంది యంగ్ ప్లేయర్లు ఉన్నారు. అండర్ 19తోపాటు, దేశవాళీలో పరుగులు, వికెట్ల వర్షం కురిపిస్తూ.. టీమిండియాలో చోటు కోసం కర్ఛీప్ వేస్తున్నారు. అయితే, కొందరు రాణిస్తున్నా.. మరికొందరు రెండు, మూడు గేమ్‌లతోనే కనుమరుగైపోతున్నారు. కొంతమంది మాత్రం నిలకడగా రాణిస్తూ.. టీమిండియాకు భ్యవిష్యత్తు ప్లేయర్లుగా పేరుతెచ్చుకుంటున్నారు. వారిలో ముఖ్యంగా ఓ ప్లేయర్ గురించి చెప్పుకోవాలి. ఫిబ్రవరి 3, 2018లో భారత్ తన నాల్గవ అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇందులో కొందరు ప్లేయర్స్ సత్తా చాటడంతో.. టీమిండియాలోనూ చోటు దక్కించుకున్నారు.

ఇవి కూడా చదవండి

యువ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా సారథ్యంలో భారత్ ఈ ప్రపంచకప్ గెలిచింది. మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరిగిన ఈ ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ టీమ్‌లోని చాలా మంది స్టార్లు ఈ రోజు టీమ్ ఇండియాకు గర్వకారణంగా నిలిచారు.

ప్రస్తుతం తన బ్యాట్‌తో భయాందోళనలు సృష్టిస్తున్న ఈ యంగ్ ప్లేయర్ భారత జట్టులో కీలకంగా మారిపోయాడు. అండర్ 19 ఫైనల్ మ్యాచ్‌లో 94 బంతుల్లో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐసీసీ అండర్-19 2018 ప్రపంచకప్‌లో భారత్ తరపున సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఆయన ఎవరో కాదు.. శుభ్మన్ గిల్. శుభమాన్ గిల్ 8 సెప్టెంబర్ 1999న భారతదేశంలోని పంజాబ్‌లోని ఫజిల్కాలో జన్మించాడు. అతను పంజాబ్‌లోని మొహాలీలోని మానవ్ మంగళ్ స్మార్ట్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించాడు. శుభ్‌మాన్ చిన్నతనం నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాలు అతనికి స్ఫూర్తి.

శుభమాన్ గిల్ తండ్రి లఖ్వీందర్ సింగ్ రైతు. కొడుకు క్రికెట్ ప్రాక్టీస్ కోసం పొలంలో మైదానం నిర్మించి, ఆడేందుకు టర్ఫ్ పిచ్ కూడా తయారు చేశాడు. లఖ్వీందర్ తన కొడుకు వికెట్ తీయమని గ్రామంలోని అబ్బాయిలను సవాలు చేసేవాడు. వారు విజయం సాధిస్తే, 100 రూపాయలు చెల్లించేవాడు.

ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2018లో శుభ్‌మన్ గిల్ భారత్ తరపున ఆడాడు. ఈ ప్రపంచకప్‌ను భారత్‌ గెలుచుకుంది. ఈ విజయం సాధించిన హీరోల జాబితాలో శుభ్‌మన్ గిల్ పేరు చేరింది. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ – 19 ఏళ్ల వయసులో నేను అతనిలో 10 శాతం కూడా ఆడలేదు. కేవలం 23 ఏళ్ల వయసులో భారత్ తరపున వన్డే క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించి, సరికొత్త ఆశలు రేపుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..