అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్దిరిపోయే సెంచరీ.. 33 ఫోర్లు, 2 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్.. కట్ చేస్తే!

అప్పటికే వన్డేలు, టీ20ల్లో అదరగొట్టిన ఈ ప్లేయర్.. ఆ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌తోనే టెస్టుల్లోకి అరంగేట్రం చేసింది. మొదటి మ్యాచ్‌లోని తుఫాన్ ఇన్నింగ్స్..

అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్దిరిపోయే సెంచరీ.. 33 ఫోర్లు, 2 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్.. కట్ చేస్తే!
Shikhar Dhawan
Follow us

|

Updated on: Feb 03, 2023 | 10:29 AM

అప్పటికే వన్డేలు, టీ20ల్లో అదరగొట్టిన ఈ ప్లేయర్.. ఆ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌తోనే టెస్టుల్లోకి అరంగేట్రం చేసింది. మొదటి మ్యాచ్‌లోని తుఫాన్ ఇన్నింగ్స్.. అద్దిరిపోయే సెంచరీతో ప్రత్యర్ధి బౌలర్ల మోతమ్రోగించాడు. ఆ తర్వాత కొద్దికాలం పాటు ఓపెనర్‌గా టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు ఈ ఆటగాడు.. మరెవరో కాదు శిఖర్ ధావన్.

2012-13 మార్చి 14-18 మధ్య ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. 187 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 408 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్(92), డేవిడ్ వార్నర్(71), కొవాన్(86) టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో జడేజా, ఇషాంత్ చెరో 3 వికెట్లు.. అశ్విన్, ఓజా రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఇక మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు మురళీ విజయ్(153), శిఖర్ ధావన్(187) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అలాగే విరాట్ కోహ్లీ(67) అర్ధ సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు 499 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో సిడిల్ 5 వికెట్లు పడగొట్టాడు. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌట్ అయి.. భారత్‌కు 133 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యచేధనను టీమిండియా 4 వికెట్లు కోల్పోయి చేధించింది.

అరంగేట్రం మ్యాచ్‌లో అద్దిరిపోయే సెంచరీ..

ఈ సిరీస్‌తోనే శిఖర్ ధావన్ టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే అద్భుతమైన సెంచరీ చేసి తన సత్తా చాటుకున్నాడు. 174 బంతులు ఎదుర్కున్న ధావన్.. 33 ఫోర్లు, 2 సిక్సర్లతో 187 పరుగులు చేశాడు. అటు మురళీ విజయ్ కూడా 19 ఫోర్లు, 3 సిక్సర్లతో 153 పరుగులు చేయడంతో.. టీమిండియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు వీరిద్దరూ కీలక పాత్రలు పోషించారు.