BAN vs IND: బంగ్లా బ్యాటర్లతో సై అంటై సై అంటోన్న సిరాజ్.. ఈసారి శాంటోకు చుక్కలు చూపించాడుగా..
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ , ఆతిథ్య జట్టు కెప్టెన్ లిటన్ దాస్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు లిటన్ వికెట్లను పడగొట్టి పైచేయి సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ సిరాజ్ జోరు చూపిస్తున్నాడు.

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ , ఆతిథ్య జట్టు కెప్టెన్ లిటన్ దాస్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు లిటన్ వికెట్లను పడగొట్టి పైచేయి సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ సిరాజ్ జోరు చూపిస్తున్నాడు.ఈసారి మరో బంగ్లాదేశ్ బ్యాటర్‌తో ఢీకొన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో, సిరాజ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఇన్నింగ్స్‌లో శాంటో హాఫ్ సెంచరీ చేశాడు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ జట్టుకు శుభారంభం లభించింది. భారత జట్టు బంగ్లాదేశ్‌కు 513 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో బంగ్లాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు ఇద్దరూ అర్ధ సెంచరీలు సాధించారు. ముఖ్యంగా శాంటో దూకుడుగా ఆడాడు. ఇదే సమయంలో సిరాజ్ కట్టుదిట్టంగా బంతులేస్తూ బంగ్లా బ్యాటర్లను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆతిథ్య జట్టు ఆటగాళ్లు నిలకడగా ఆడారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లోగానే రెండో ఇన్నింగ్స్ లో శాంటోపై స్లెడ్జింగ్‌కు దిగాడు సిరాజ్. అయితే లిటన్ దాస్‌లా శాంటో వెర్రివేషాలు వేయలేదు. ఎప్పటిలాగే బంతిని డిఫెండ్ చేసుకుంటూ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.
బంగ్లా రెండో ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ శాంటో చిరునవ్వుతో సిరాజ్‌కు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు తప్ప దాస్‌లా అనవసరంగా వికెట్ సమర్పించుకోలేదు. ఇంతకు ముందు కూడా శాంటో, సిరాజ్ మధ్య గొడవ జరిగింది. మూడు వన్డేల సిరీస్‌లో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. కాగా బంగ్లాదేశ్‌కు భారత్ 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యం ముందు బంగ్లాదేశ్ పటిష్టంగా ఆరంభించింది. శాంటో, జకీర్ హసన్ తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 124 పరుగులు చేశారు. ఉమేష్ యాదవ్ శాంతోకు పెవిలియన్ దారి చూపించాడు. శాంటో 156 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు సహాయంతో 67 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో యాసిర్ అలీ రూపంలో బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. యాసిర్ ఐదు పరుగులు చేశాడు. ప్రస్తుతం బంగ్లా స్కోరు 4 వికెట్ల నష్టానికి 231 రన్స్ చేసింది. షకీబ్ అల్ హసన్ (17), ముష్ఫికర్ రహీమ్ (22) క్రీజులో ఉన్నారు. బంగ్లా విజయానికి 281 పరుగులు అవసరం కాగా టీమిండియా గెలుపునకు 6 వికెట్లు తీయాల్సి ఉంది.




This test match is gonna end in blood drawn like there is no reason for this behaviour they’ve already won the match pic.twitter.com/pal8w4cRsl
— adi ✨??| haris rauf cheerleader (@notanotheradi) December 17, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..




