AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BAN vs IND: అరంగేట్రంలోనే అద్భుత సెంచరీ.. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన యంగ్‌ ప్లేయర్‌

కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న హసన్ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. మొత్తం 219 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసిన జకీర్‌ ఛటోగ్రామ్‌ టెస్టును మధురజ్ఞాపకంగా మార్చుకున్నాడు.

BAN vs IND: అరంగేట్రంలోనే అద్భుత సెంచరీ.. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన యంగ్‌ ప్లేయర్‌
Zakir Hasan
Basha Shek
|

Updated on: Dec 17, 2022 | 4:49 PM

Share

ఛటోగ్రామ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న టెస్టులో బంగ్లాదేశ్ ఓటమిదిశగా పయనిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌ ఆ జట్టు యంగ్‌ ప్లేయర్‌ జకీర్ హసన్‌కు చాలా ప్రత్యేకంగా మారింది. కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న హసన్ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. మొత్తం 219 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసిన జకీర్‌ ఛటోగ్రామ్‌ టెస్టును మధురజ్ఞాపకంగా మార్చుకున్నాడు. జకీర్ హసన్ 2018లో తన అరంగేట్రం టీ20 చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగేళ్ల తర్వాత టెస్టు జట్టులో అవకాశం లభించడంతో దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఏమీ చేయలేక 45 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. సిరాజ్ అతనికి పెవిలియన్ దారి చూపించాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో జకీర్ మ్యాచ్ షాంటోతో కలిసి ఓపెనింగ్‌కు వచ్చాడు. తెలివిగా బ్యాటింగ్ చేసిన అతను షాంటోతో కలిసి తొలి వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. శాంటో ఔటైన తర్వాత కూడా ఒక ఎండ్ నుంచి క్రీజులో పాతుకుపోయి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా బంగ్లాదేశ్‌ నుంచి అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అతనికి ముందు, అమీనుల్ ఇస్లాం 2000 సంవత్సరంలో భారత్‌తో జరిగిన అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ సాధించి, అలా చేసిన మొదటి బంగ్లాదేశ్ ఆటగాడిగా నిలిచాడు. అతని తర్వాత మహ్మద్ అష్రాఫుల్, అబ్దుల్ హసన్ సెంచరీలు సాధించారు.

అంతకుముందు జకీర్ హసన్ కూడా బంగ్లాదేశ్ ఎ తరఫున ఆడుతూ ఇండియా ఎపై సెంచరీ సాధించాడు. నాలుగు రోజుల అనధికారిక టెస్టులో 173 పరుగుల ఇన్నింగ్స్ ఆధారంగా అతనికి టెస్టు జట్టులో అవకాశం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయినా.. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లను చాలా ఇబ్బంది పెట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు భారత్ 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ స్కోరు కళ్ల ముందు కనిపిస్తున్నా శాంటో, జకీర్ హసన్ తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 124 పరుగులు చేశారు. ఆ తర్వాత ఉమేష్ యాదవ్ శాంతోను పెవిలియన్ కు పంపించాడు. అతను 156 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు సహాయంతో 67 పరుగులు చేశాడు. సెంచరీ చేసిన జకీర్‌ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం బంగ్లా స్కోరు 6 వికెట్ల నష్టానికి 241 రన్స్‌ చేసింది. నురుల్ హసన్‌ (22), మెహదీ హసన్‌ మిరాజ్‌ (0) క్రీజులో ఉన్నారు. బంగ్లా విజయానికి 271 పరుగులు అవసరం కాగా టీమిండియా గెలుపునకు 4 వికెట్లు అవసరం.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..