Babar Azam: డాక్టర్ అవతారం ఎత్తిన బాబర్ ఆజమ్.. వీడియో వైరల్
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, బ్యాటింగ్‌లోనే కాదు, ఇప్పుడు డాక్టర్ మారి వార్తల్లో నిలిచాడు. పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో షాహీన్ షా ఆఫ్రిదీ గాయం పాలవడంతో బాబర్ తన సహచరుడికి ప్రథమ చికిత్స అందించి "డాక్టర్ బాబర్" గా పేరుతెచ్చుకున్నాడు. ఆఫ్రిదీ బొటనవేలుకు గాయం కావడంతో, బాబర్ ఆజమ్ ఆఫ్రిదీకి చికిత్స చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ బ్యాటింగ్ తోనే కాదు ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తి వార్తల్లో నిలిచాడు. నిన్న మొన్నటి వరకు అటు ఫామ్ కోల్పోయి ఇటు కెప్టెన్సీ కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొన్న బాబర్ ఆజమ్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెర్త్‌లో ఆస్ట్రేలియా పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో షాహీన్ షా ఆఫ్రిదీ బొటన వేలికి గాయం అవడంతో బాబర్ ఆజం సహాయం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియన్ ఇన్నింగ్స్ 26వ ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది, ఫిల్డర్ విసిరిన త్రోను బంతిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు బౌన్స్‌ను తీసుకున్న బంతి నేరుగా అఫ్రిది బొటనవేలుకు తాకింది. దీంతో ఆఫ్రిది గాయంతో విలవిల్లాడిపోయాడు.
అతడి బొటనవేలు డిస్ లొకేట్ అయి ఉండవచ్చు అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బాబర్ ఆజమ్ తన సహచరుడికి సహాయం చేయడానికి పరిగెత్తాడు. ఆఫ్రిది బొటనవేలును పట్టుకోని తనకు తెలిసిన విద్యను ప్రదర్శించి ప్రథమ చికిత్స చేశాడు. దీంతో కామెంటెటర్స్ బాబర్ ఆజమ్ ని డాక్టర్ అంటూ చమత్కరించారు. బాబర్ ఆజమ్ ఇలా చేసిన వెంటనే బంతిని అందుకుని తిరిగి బౌలింగ్ చేశాడు ఆఫ్రీది.
ప్రస్థుతం ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ పెడుతున్నారు “కింగ్ బాబర్, ఇప్పుడు డాక్టర్” అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు “డాక్టర్ బాబర్ ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంటాడు అని వ్యాఖ్యానించారు. అయితే అఫ్రిది బొటన వేలుకు బంతి తగలగానే బాబర్ చేసిన ఈ పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. డాక్టర్ బాబర్ ఆజమ్ క్యూట్ అని ప్రశంసిస్తున్నారు.
ఇక సిరీస్ విషయానికి వస్తే పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్ గా భాద్యతలు చేపట్టిన మహ్మద్ రిజ్వాన్ తొలి సిరీస్ లోనే జట్టుకు వన్డే సిరీస్ ను అందించాడు. 2002 తర్వాత మొదటిసారిగా ఆస్ట్రేలియాలో ద్వైపాక్షిక సిరీస్ విజయాన్ని అందించన కెప్టెన్ గా ఘనత సాధించాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలోనే ఆస్ట్రేలియాలో ఆ జట్టు ఈ సిరీస్ విజయం సాధించడంతో ఆ జట్టకు కాస్త ఊరట లభించింది.
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బాబర్ ఆజామ్ కెప్టెన్సీ నుంచి వైదొలిగడంతో అతని స్థానంలో రిజ్వాన్ జట్టు పగ్గాలు చేపట్టాడు. అదే సమయంలో, వైట్-బాల్ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ తన పదవి నుండి వైదొలిగాడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధికారులతో విభేదాల కారణంగా కిర్‌స్టన్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు తాత్కాలిక కోచ్ గా ఆసీస్ మాజీ పేసర్ జాసన్ గిలెస్పీ బాధ్యతలు చేపట్టాడు.
Dr Babar is on the case! 👨⚕️#AUSvPAK pic.twitter.com/FupHfqon3p
— cricket.com.au (@cricketcomau) November 10, 2024



