IPL 2025 Auction: ఆ పదిమంది కోసం కోట్లు కుమ్మరించనున్న ఫ్రాంచైజీలు
ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఇందులో పలు ప్రముఖ ఆటగాళ్లు భారీ ధర పలికే అవకాశముంది. ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోకుండా వదులుకున్న రిషబ్ పంత్, కేకేఆర్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ వంటి స్టార్ ప్లేయర్లు వేలం భారీ ధర పలికే అవకాశముంది. వీరితో పాటు మరో పది మంది కీలక ఆటగాళ్లకు ఈ సారి వేలంలో డిమాండ్ ఉండే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం క్రికెట్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తమ ఫెవరెట్ ప్లేయర్ ని ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందనే క్యురియాసిటితో మెగా వేలం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో వేలంలో ఉన్న కొంత మంది ఆటగాళ్లు ఈ సారి భారీ ధర పలికే అవకాశముంది.
టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోకపోవడం ఎవరు ఊహించలేదు. పంత్ ఢిల్లీ టీమ్ కి అతిముఖ్యమైన ఆటగాడు అయినప్పటికి ఢిల్లీ క్యాపిటెల్స్ అతన్ని పక్కన పెట్టింది. అటు గత సీజన్ లో కేకేఆర్ ని లీగ్ ఛాంపియన్ గా నిలిపిన శ్రేయస్ అయ్యార్ ని సైతం ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు. అయితే వీరితో పాటు లీగ్ లో అత్యంత ఆదరణ సంపాదించుకున్న మరికొంత మంది స్టార్ ప్లేయర్లను ఆయా ప్రాంచైంజీలు వదులుకున్నాయి. అయినప్పటికి ఈ సారి మెగా వేలంలో వారందరు భారీ ధర పలికే అవకాశముంది. వేలంలో అత్యధిక ధర పలికే అవకాశమున్న ఆ 10 మంది ఆటగాళ్లు ఎవరో ఓ సారి పరిశీలిస్తే.
రిషబ్ పంత్ (బేస్ ప్రైస్ రూ.2 కోట్లు)
మెగా వేలంలో ప్రతి ఒక్క టీమ్ దక్కించుకోవాలనుకునే ముఖ్యమైన ఆటగాడు పంత్. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌తో సహా అనేక ఫ్రాంచైజీలు పంత్ స్థాయి ఉన్న వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ కోసం తమ దగ్గర ఉన్న మనీని వెచ్చించడానికి సిద్దంగా ఉన్నాయి. ఆ లెక్క ప్రకారం పంత్ బిడ్డింగ్ జరిగే సమయానికి దాదాపు అన్ని ఫ్రాంచైజీలు అతని కోసం పోటీ పడిన ఆశ్యర్యపోనవసరం లేదు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ (PBKS), ఆర్సీబీ (RCB) వంటి ఫ్రాంచైజీలకు అతడి అవసరం ఎక్కువగా ఉంది. పంత్ ను దక్కించుకుని తమ కెప్టెన్ గా నియమించుకోవాలని ఈ రెండు యాజమాన్యాలు యోచిస్తున్నాయట. ఇక పంత్ ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ అతడి కోసం బిడ్డింగ్ లోకి వస్తుందా లేదా.. ఒకవేళ వస్తే ఎంత వరకు పెడతారో అనేది ఆశక్తికరంగా మారింది.
శ్రేయాస్ అయ్యర్ (బేస్ ప్రైస్ రూ.2 కోట్లు)
వేలంలో అయ్యర్‌ను దక్కించుకోవడానికి DC 25 కోట్ల రూపాయల బిడ్డింగ్ వేయవచ్చని తెలుస్తోంది. పంత్ ను వదిలేసిన తరువాత ఢిల్లీ క్యాపిటెల్స్ కి కెప్టెన్ అవసరం ఉంది. దీంతో గత సీజన్ లో KKR కి టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన అయ్యర్ కోసం ఢిల్లీ ప్రయత్నించవచ్చు. గతంలో కూడా అయ్యర్ ఢిల్లీ క్యాపిటెల్స్ కి కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
కేఎల్ రాహుల్ (బేస్ ప్రైస్ రూ.2 కోట్లు)
గత సీజన్ లో రాహుల్ పర్ఫామెన్స్ పై చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రాహుల్ స్ట్రైక్ రేట్ టీ20 ఫార్మాట్ కు సరిపోదని అందరు విమర్శించారు. లక్నో సూపర్ జెయింట్ కూడా రాహుల్ అంటే విముఖత చూపుతోంది. అయితే రాహుల్ జట్టు లోకి వస్తే కెప్టెన్ గా కీపర్ గా బ్యాట్స్మెన్ గా సేవలు అందిస్తాడని కొన్ని ఫ్రాంచైజీలు అతన్ని దక్కించుకోవాలని చూస్తున్నాయట. ముఖ్యంగా ఆర్సీబీ కి కెప్టెన్సీ అవసరం ఉంది కాబట్టి రాహుల్ కోసం ఆ ఫ్రాంచైజీ ప్రయత్నించే అవకాశముంది.
ఇషాన్ కిషన్ (బేస్ ప్రైస్ రూ.2 కోట్లు)
జార్ఖండ్‌కు చెందిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ 2022 వేలంలో రెండవ అత్యంత ఖరీదైన భారతీయ ఆటగాడిగా నిలిచాడు, ముంబై ఇండియన్స్ అతన్ని రూ. 15.25 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. MI ఇషాన్ కిషన్ ను రిటైన్ చేసుకోలేదు. ఈసారి కూడా వేలంలో ఇషాన్ ను తిరిగి కొనుగోలు చేసేందుకు వేలంలో ప్రయత్నించవచ్చు. ఇషాన్ కిషన్ MI మరోమారు భారీ ధర వెచ్చించే అవకాశముంది.
యుజ్వేంద్ర చాహల్ (బేస్ ప్రైస్ రూ.2 కోట్లు)
ఈ లెగ్ స్పిన్నర్ తన వికెట్ టేకింగ్ సామర్థ్యంతో ఈ సారి వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాళ్లలో ఒకడిగా నిలిచే అవకాశముంది. రాజస్థాన్ రాయల్స్ చాహల్ ను విడుదల చేసింది. అయితే వారే అతనిని తిరిగి కొనుగోలు చేసే అవకాశముంది. చాహల్ కోసం ఇతర ఫ్రాంచైజీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. దీంతో అతడు భారీ ధర పలికే అవకాశముంది.
అర్ష్‌దీప్ సింగ్ (బేస్ ప్రైస్ రూ.2 కోట్లు)
లెఫ్టార్మ్ సీమర్‌ను వదులుకోవాలని పంజాబ్ కింగ్స్ వదులుకున్న తరువాత అందరి చూపు అర్షదీప్ వైపు మళ్లాయి. జస్ప్రీత్ బుమ్రా తర్వాత భారత T20 జట్టులో అర్ష్‌దీప్ రెండవ అత్యంత ముఖ్యమైన బౌలర్. పవర్ ప్లేలో వికెట్లు తీయగలడు, డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేయగల సామర్థ్యం అర్షదీప్ సొంతం. దీంతో అర్షదీప్ ఈ వేలంలో టాప్ పిక్స్‌లో ఒకడిగా ఉంటాడనటంలో సందేహం లేదు.
మహ్మద్ షమీ (బేస్ ప్రైస్ రూ.2 కోట్లు)
34 ఏళ్ల ఫాస్ట్ బౌలర్‌కు ఫిట్‌నెస్ సమస్యగా మారింది. గుజరాత్ టైటాన్స్ అతన్ని రిటైన్ చేసుకోకపోవడానికి కారణం అదే. షమీ ఇప్పటికీ NCAలో పునరావాసం కొనసాగిస్తున్నాడు. కానీ షమీ పూర్తిగా ఫిట్‌గా మారితే ప్రమాదకరమైన బౌలర్ గా మారతాడు. చూడాలి మరి షమీని వేలంలో ఏ ప్రాంచైజీ దక్కించుకుంటుందో.
మిచెల్ స్టార్క్ (బేస్ ప్రైస్ రూ.2 కోట్లు)
గత ఏడాది వేలంలో KKR స్టార్క్ కోసం రూ. 24.50 కోట్లు వెచ్చించింది. దీంతో స్టార్క్ IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అయితే గత సీజన్ లో టోర్నీ మొత్తం విఫలమయినప్పటికి సెమీ ఫైనల్, ఫైనల్ లో సత్తా చాటి జట్టు కప్పుకొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ సారి కూడా మెగా వేలంలో స్టార్క్ భారీ ధర పలికే అవకాశం ఉంది.
జోస్ బట్లర్ (బేస్ ప్రైస్ రూ.2 కోట్లు)
ఆర్ ఆర్ తరఫున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడిన బట్లర్ గత సీజన్ లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో అతడిని రిటైన్ చేసుకోలేకపోయింది. అయినప్పటికి అతనిని వేలంలో తిరిగి దక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బట్లర్ మ్యాచ్ విన్నర్ అయినందున ఇతర జట్లు కూడా అతడి కోసం ఆసక్తి చూపుతాయనడంలో సందేహం లేదు.
రచిన్ రవీంద్ర (బేస్ ప్రైస్ రూ.2 కోట్లు)
చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రిటైన్ చేసుకోలేదు. కానీ రాచిన్ భారత్ క్రికెట్ పరిస్థితులకు చక్కగా సరిపోతాడు. పరిస్థితులను త్వరగా అర్థం చేసుకునే రచిన్.. అటు బ్యాటింగ్ బౌలింగ్ లో కీలక ప్లేయర్. సీఎస్కే మరోసారి రచిన్ ను దక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.



