AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam gambhir: గంభీర్ ను ప్రెస్ మీట్ కు పంపొదన్న సంజయ్ మంజ్రేకర్

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే ముందు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గంభీర్ ప్రెస్ మీట్ పెట్టడం తగదని.. కెప్టెన్ రోహిత్ శర్మ లేదా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌ ఇలాంటి సమావేశాలకు సరైన వారని సూచించాడు ఈ మేరకు ట్వీట్ చేశాడు. అయితే, దీనిపై అభిమానుల నుంచి విభిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు గంభీర్ కు మద్దతుగా స్పందిస్తే మరికొందరు మాత్రం మంజ్రేకర్ పోస్టు సరైందనే భావనను వ్యక్తం చేశారు.

Gautam gambhir: గంభీర్ ను ప్రెస్ మీట్ కు పంపొదన్న సంజయ్ మంజ్రేకర్
Sanjay Manjrekar Tweet On Gautam Gambhir Press Conference
Narsimha
|

Updated on: Nov 11, 2024 | 7:48 PM

Share

టీమ్ ఇండియా ఏదైనా విదేశీ పర్యటనకు బయలుదేరే ముందు జట్టు కోచ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం సర్వసాధారణం. ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లే ముందు కూడా టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యి జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. అంతే కాదు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై ఫామ్ గురించి ప్రస్తావించిన రికి పాంటింగ్ కు గట్టిగా కౌంటర్ కూడా ఇచ్చాడు.

కాగా గంభీర్ ప్రెస్ మీట్ పై మాజీ క్రికెటర్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తరచూ వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తలో ఉండే సంజయ్ ఈ సారి గంభీర్ ను టార్గెట్ చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు గౌతమ్ గంభీర్ మీడియా సమావేశం ఎలా నిర్వహించాడో తనకు తెలియదని అన్నాడు.

ఈ మేరకు సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశారు. గౌతం గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసాను. ఈ మీడియా సమావేశానికి గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ పంపడం మంచి నిర్ణయం కాదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టడం తగదు. ప్రెస్ కాన్ఫరెన్స్లో అతడికి మాట్లాడే హక్కే లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా ముందు మాట్లాడితే బాగుంటుంది. వారిద్దరే ఉత్తమ ఎంపిక అవుతారని భావిస్తున్నా అని మంజ్రేకర్ పోస్టు చేశాడు. అతని స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మను నియమించాల్సిందిగా బీసీసీఐ సెలక్టర్ అజిత్ అగార్కర్ ట్వీట్ చేశాడు. అయితే, దీనిపై అభిమానుల నుంచి విభిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు గంభీర్ కు మద్దతుగా స్పందిస్తే మరికొందరు మాత్రం మంజ్రేకర్ పోస్టు సరైందనే భావనను వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత తొలి బ్యాచ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొనడం అనుమానంగానే ఉంది. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు. మరోవైపు టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది. విజయవంతమైన జైస్వాల్‌తో ఇన్నింగ్స్‌ను ఎవరు ప్రారంభిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రేసులో అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్ ఉన్నారని గంభీర్ క్లారిటీ ఇచ్చాడు.

గత బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమ్ ఇండియా మళ్లీ నిలకడగా రాణించాలనే పట్టుదలతో ఉంది. గత రెండు పర్యటనల్లోనూ బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. రోహిత్ సేనగా మరో సిరీస్ విజయం సాధించాలనే లక్ష్యంతో  ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. నవంబర్ 22 న పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.