Gautam Gambhir: గంభీర్‌కి ఒక న్యాయం..ఆటగాళ్లకు ఒక న్యాయమా.. టీమిండియా కోచ్‌పై నెటిజన్లు ఆగ్రహం
సోమవారం ముంబై నుంచి పెర్త్ వెళ్లే ముందు గంభీర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఎందుకు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?

భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరింది. కెప్టెన్ రోహిత్ శర్మ మినహా మిగతా ఆటగాళ్లందరూ టెస్టు సిరీస్ కోసం ఆది, సోమవారాల్లో ముంబై నుంచి పెర్త్‌కు బయలుదేరారు. తాజాగా కోచ్ గౌతమ్ గంభీర్ కూడా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో గంభీర్ చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. సోమవారం ముంబై నుంచి పెర్త్ వెళ్లే ముందు గంభీర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ఒక సంస్థ ప్రకటనకు సంబంధించింది. అందులో గంభీర్ స్వయంగా నటిస్తున్నట్లు కనిపించింది. గంభీర్ ఈ వీడియోను పోస్ట్ చేసిన వెంటనే, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు అతని నటనను ప్రశంసించడం ప్రారంభించగా, మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవానికి గౌతమ్ గంభీర్ చేసిన ఈ ప్రకటన క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌కు చెందింది. క్రిప్టోకరెన్సీకి భారతదేశంలో చట్టబద్ధత లేదు. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన కంపెనీ ప్రమోషన్స్‌లను ఇండియన్ బోర్డ్ నిషేధించింది. క్రిప్టో మాత్రమే కాదు, బెట్టింగ్ కంపెనీలపైనా కూడా బీసీసీఐ నిషేధం విధించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. . దీంతో టీమిండియా హెడ్ కోచే క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. BCCI క్రిప్టోకరెన్సీ లేదా దానికి సంబంధించిన కంపెనీలను ప్రోత్సహించకుండా ఆటగాళ్లను నిషేధిస్తూ వస్తుంది. కానీ ఎప్పుడు కూడా క్రిప్టోకరెన్సీకి సంబంధించి బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Every time I found myself in an unfamiliar situation in my cricketing career, I never let it get me down. Instead, I adapted to it by learning.
Early in my career, the T20 format was introduced. I trained hard for it and learnt to play it. Learning made me confident in something… pic.twitter.com/vxW4RKIGza
— Gautam Gambhir (@GautamGambhir) November 11, 2024




