IPL 2024 Points Table: కోహ్లీని వెనక్కునెట్టిన రియాన్ పరాగ్.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రియాన్ పరాగ్ అజేయంగా 84 పరుగులు చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 185 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 173 పరుగులకే పరిమితమైంది. ఇక ఐపీఎల్‌లో శుక్రవారం (మార్చి 29) బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. మరి ఈ మ్యాచ్ కు IPL 2024 పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

IPL 2024 Points Table: కోహ్లీని వెనక్కునెట్టిన రియాన్ పరాగ్.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
RR vs DC Match
Follow us

|

Updated on: Mar 29, 2024 | 4:50 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ ప్రారంభమై ఒక వారం గడిచింది. ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు జరిగాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా గురువారం (మార్చి28) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. రియాన్ పరాగ్ అజేయంగా 84 పరుగులు చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 185 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 173 పరుగులకే పరిమితమైంది. ఇక ఐపీఎల్‌లో శుక్రవారం (మార్చి 29) బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. మరి ఈ మ్యాచ్ కు IPL 2024 పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

  1. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన చెన్నై ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఆజట్టు రన్ రేట్ +1.979.
  2. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆర్ ఆర్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు రన్ రేట్ +0.800
  3. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక ఓటమి, ఒక విజయం సాధించింద. ఆ జట్టు 2 పాయింట్లు సాధించి మూడో స్థానానికి చేరుకుంది. రన్ రేట్ +0.675.
  4. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా ఒక మ్యాచ్ గెలిచి 2 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. నెట్ రన్ రేట్ +0.200.
  5. శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక ఓటమితో 2 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ +0.025.
  6. ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదో స్థానానికి ఎగబాకింది. ఆడిన 2 మ్యాచ్‌ల్లో 1 ఓటమి, 1 విజయంతో 2 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ -0.180.
  7. శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలోని గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడి 2 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ -1.425.
  8. రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడడంతో ఎనిమిదో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ -0.528.
  9. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్లు సాధించకుండా తొమ్మిదో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ -0.925.
  10. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఒక మ్యాచ్‌లో ఓడి పదో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ -1.000.

ఆరెంజ్ క్యాప్ జాబితాలో హైదరాబాద్‌కు చెందిన హెన్రిచ్ క్లాసెన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 143 పరుగులు చేశాడు. రాజస్థాన్ ఆటగాడు ర్యాన్ పరాగ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 127 పరుగులు చేసిన రెండో స్థానానికి ఎగబాకాడు. ఆర్సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. అతను ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మొత్తం 98 పరుగులు చేశాడు.

పర్పుల్ క్యాప్ జాబితాలో సీఎస్‌కే ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ మొత్తం 6 వికెట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అతని వెనుక పంజాబ్ కింగ్స్ ఆటగాడు హర్‌ప్రీత్ బ్రార్ ఉన్నాడు, అతను ఆడిన రెండు మ్యాచ్‌లలో 3 వికెట్లు తీసుకున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీరు ఇప్పుడే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలా?
మీరు ఇప్పుడే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలా?
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం