IPL 2024: కీలక సమయంలో ఔట్.. సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

ఆతిథ్య జట్టులో ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ 45 బంతుల్లో 84 పరుగులతో అద్భుతంగా రాణించాడు. అతని ఖాతాలో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉఉన్నాయి. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. అయితే రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది

IPL 2024: కీలక సమయంలో ఔట్.. సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
Rishabh Pant
Follow us

|

Updated on: Mar 29, 2024 | 4:09 PM

ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం (మార్చి 28) ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ (RR vs DC) మధ్య మ్యాచ్ జరిగింది . జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆతిథ్య జట్టులో ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ 45 బంతుల్లో 84 పరుగులతో అద్భుతంగా రాణించాడు. అతని ఖాతాలో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉఉన్నాయి. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. అయితే రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఛేదనలో ఢిల్లీ బాగానే ఆడినా చివరి ఓవర్‌లో 17 పరుగులు చేయడంలో విఫలమైంది. ఢిల్లీ తరఫున డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో 49 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా క్రికెటర్ ట్రిస్టన్ స్టబ్స్ 23 బంతుల్లో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జట్టు కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ రిషభ్‌ పంత్ 26 బంతుల్లో 28 పరుగులు చేసి కీలక సమయంలో వికెట్ సమర్పించుకున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 100వ ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రిషబ్ 14వ ఓవర్ తొలి బంతికి యుజ్వేంద్ర చాహల్ చేతిలో ఔటయ్యాడు. 4వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌ను సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. కీలక దశలో ఔట్ అయిన పంత్ మ్యాచ్‌ను గెలిపించలేకపోయాననే కారణంతో తీవ్ర అసహనానికి లోనయ్యాడు. పెవిలియన్‌కు తిరిగి వస్తున్న సమయంలో బ్యాట్‌ను తీసి కర్టెన్ కు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఔటయ్యాక పెవిలియన్ వెళుతోన్న పంత్..

2016లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసి, 2021లో జట్టు కెప్టెన్‌గా నియమితులైన పంత్ గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 100 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ప్రపంచంలోని అత్యంత సంపన్న ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లో ఒక జట్టు కోసం 100 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన 21వ ఆటగాడిగా పంత్ నిలిచాడు. అంతేకాదు ఐపీఎల్‌లో ఢిల్లీ తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సర్లు మరియు అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డులు కూడా పంత్ పేరు మీదనే ఉన్నాయి.

ఢిల్లీ తరఫున మొదటి ఆటగాడిగా…

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..